హైదరాబాద్

నీటి సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 13: నీటి సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. ప్రపంచ వాటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాక్ ఫర్ వాటర్ సంస్థ, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకుడు కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి చుక్కా రామయ్య, కోదండరామ్ హాజరై ప్రసగించారు. ప్రస్తుతం నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతుందని, సహజ సిద్ధంగా అందరికీ అందుబాటులో ఉండే నీరు లేకుండా పోవడం ఎంతో ఆవేదన కలిగించే అంశమని అన్నారు. కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంవల్ల సరైన వర్షాలు లేక, పెరుగుతున్న జనాభాకు సరిపడా నీరు అందక పోవడంతో మనుషులు, పశుపక్ష్యాదులు సైతం దాహంతో అలమటిస్తున్నాయని చెప్పారు. నగరాల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరింత దారుణంగా ఉందని, కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీటిని తీసుకురావాల్సిన దుస్థితి ఉందన్నారు. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో నీటి సమస్య తలెత్తిందని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పది అడుగుల్లోతు ఉన్న బావుల నుంచి నీరు చేదుకొని వాడుకుంటే ప్రస్తుతం వెయ్యి అడుగులు వేసినా నీటి జాడ కనిపించక పోవడం బాధాకరమని అన్నారు. వీటన్నింటి నేపధ్యంలో నీటి సంరక్షణకు ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన సూచించారు.