సాహితి

బిక్కమొహం...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోడ్డున
పూల వర్షం కురిసింది!
బహుశా -
ఎవరో నేలతల్లిని చేరుకునేందుకు
ప్రయాణం కట్టినట్లున్నాడు!?

మొన్న కల్సినవాడిని
అభిమానంగా పలకరిద్దామని
బయలుదేరాను!
చిత్రం!
ఆ ఇంట్లో ఫొటోలోకి చేరి దండై వేలాడుతూ
వెక్కిరించాడు!!

కొన్ని కరచలనాలు నీడలై
చాలాసార్లు జ్ఞాపకాల ముద్రవేసుకొని
వెంటాడుతూంటాయి!

ఏడ్వడానికి కన్నీళ్ళే రానంత దుఃఖం
మనసు పొరల్లో కల్లోలితం చేస్తూండగా
అనిపిస్తోంది -
నా జ్ఞాపకశక్తి వాళ్ళతోపాటే వెళ్ళిపోతే
బావుణ్ణని!!

ఇప్పుడనిపిస్తోంది...
జ్ఞాపకం-
మధుర క్షణాల్ని మోసే వరమో?
మనస్సును మెలిపెట్టేంత శాపమో!
అర్థంకాక బిక్కమొహంతో...??

- చలపాక ప్రకాష్ 9247475975