వరంగల్

వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, నవంబర్ 21: వరంగల్ ఉప ఎన్నికను పురస్కరించుకొని శనివారం నిర్వహించిన పోలింగ్ పరకాలలో ప్రశాంతంగా జరిగింది. ఉదయం పూట మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నం వరకు పుం జుకుంది. ఉదయం 10శాతం నమోదుతో ప్రారంభమై మధ్యాహ్నం 61 శాతానికి పోలింగ్ నమోదు అయింది. ఓటింగ్ ముగిసే సమయానికి సుమారు 71 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ముందుగా ఓటేసిన వారికి పువ్వు...
వరంగల్ ఉప ఎన్నికను పురస్కరించుకొని శనివారం ప్రతి పోలింగ్ బూత్‌లో తొలి ఓటు హక్కు వినియోగించుకున్న వారికి పూలతో స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషవర్ భన్వర్‌లాల్ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పూలను సరఫరా చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా ఈసారి ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి అందరికన్నా ముందుగా వచ్చి ఓటు వేసే మొట్ట మొదటి ఓటరుకు పువ్వు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఓటు హక్కును కల్పించారు.
మొరాయించిన ఈవిఎంలు
ఎంపి ఉప ఎన్నికను పురస్కరించుకొని ఈవీఎంలు మొరాయించి ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలు ప్రారంభించడంతో ఓటర్లు బారులు తీరారు. శనివారం పరకాల మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, భూ పాలపల్లి పట్టణంలో ఒక పోలింగ్ కేంద్రం, సంగెం మండలం ఎల్గూరి స్టేషన్ బూత్ నెంబర్ 201, రాం చంద్రాపూరం 224, గవిచర్లలో 212, 213 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో వృద్ద ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ అధికారులు ఈవీఎంలపై అవగాహన లేక వాటిని సరిగా అమర్చక పోవడంతో పోలింగ్ అలస్యంగా ప్రారంభం అయింది.
ఓటు వేసిన స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
వరంగల్ ఉప ఎన్నికను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పరకాల మండలం నర్సక్కపల్లిలో ఓటు వేశారు. అదేవిధంగా పరకాల జడ్పిటిసి పాడి కల్పనాదేవి నర్సక్కపల్లిలో ఓటు వేశారు. పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పరకాల పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఓటు వేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడారు.
అభ్యర్థులు, చల్లా, ఇనగాల పోలింగ్ కేంద్రాల సందర్శన
వరంగల్ ఉప ఎన్నికను పురస్కరించుకొని శనివారం పరకాల పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్, బిజెపి అభ్యర్థి డాక్టర్ పగడిపాటి దేవయ్య, వామపక్షాల అ భ్యర్థి గాలి వినోద్‌కుమార్, పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
శాయంపేటలో..
శాయంపేట: ఇక్కడ పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలోని 248 పోలింగ్ కేంద్రంతో ఈవిఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. అదేవిధంగా శాయంపేటలోని 242 పోలింగ్ కేంద్రంలో కూడా ఈవిఎం మొరాయించడంతో పోలింగ్ కొంత ఆలస్యమైంది. మండలంలోని 18 గ్రామాలలో ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ప్రశాంతంగా జరిగాయి. మండల కేంద్రంలో పోలింగ్ చిట్టిలు సక్రమంగా అందలేదని విపక్షాలకు చెందిన నాయకులు, ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ చిట్టిలు అందక కొంత మంది ఓటర్లు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు నిరాశకు గురయ్యారు. ఉప ఎన్నికకు మండలంలో 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రశాంతంగా నిర్వహణకు గాను 120 మంది పోలీసులు, 14 మంది ఎస్సైలు, నలుగురు సిఐలు ఒక డిఎస్పి పర్యవేక్షణలో మండలంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ పర్యవేక్షణలో ఉప పోరు ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 71శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బొల్లికుంటలో ఓటేసిన టిఆర్‌ఎస్ అభ్యర్థి
సంగెం: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ తన స్వగ్రామం బొల్లికుంటలో ఓటు హ క్కును వినియోగించుకున్నారు.
రేగొండలో
రేగొండ: రేగొండ మండలంలో జరిగిన వరంగల్ ఉప ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని 27 గ్రామాల్లో 21,009 మంది పురుషులు, 21,027 మంది మహిళలు ఉండగా 54 పోలింగ్ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. 74 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 78శాతం పోలింగ్ కాగా ఈ ఎన్నికలో నాలుగు శాతం పోలింగ్ తగ్గింది. మండలంలోని బాగిర్తిపేట, గూడెపల్లి, తిర్మలగిరి, పొనగల్లు లాంటి సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ సిబ్బంది భారీగా మోహరించి బందోబస్తు నిర్వహించారు.
మొగుళ్ళపల్లి మండలంలో..
మొగుళ్ళపల్లి:మండలంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. భారీ బందోబస్తు కారణంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తహశీల్దార్ ఆంజనేయులు తెలిపారు. మొగుళ్ళపల్లి మండలంలోని 20 గ్రామాలలో శివారు పల్లెల్లో 39 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా 28,996 ఓట్లు ఉండగా శనివారం జరిగిన పోలింగ్‌లో 74శాతం పోలయ్యాయి. 20,916 ఓట్లు పోలైనట్లు ఆయన చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 85.27శాతం పోలింగ్ కాగా నేడు జరిగిన ఎన్నికల్లో 74.10శాతం పోలయ్యాయని తహశీల్దార్ తెలిపారు. మొగుళ్ళపల్లిలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఒక ఈవి ఎం మొరాయించగా కొంతసేపటి తరువాత యధావిధిగా పోలింగ్ జరిగిందని చెప్పారు.
చిట్యాలలో
చిట్యాల: మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలంలోని 31 గ్రామపంచాయతీలలో 61 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 73.2శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి, తహశీల్దార్ లక్ష్మయ్య తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేసేందుకు ఉత్సాహంగా క్యూలో నిల్చున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఒడితల శివారు కొత్తపేట లో పోలింగ్ కేంద్రంలో ఈవిఎం అరగంట మొరాయించ్డం మినహా పోలింగ్ సాఫీగా జరిగింది. మావోయిస్టుల ప్రాభల్య ప్రాంతంగా పేరుగాంచిన చిట్యాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పట్ల పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మావోయిస్టు పార్టీలో ఉన్న కీలక నేతలు స్వగ్రామమైన వెలిశాల గ్రామంలో ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రశాంతంగా ముగిసిన ఉపఎన్నిక పోలింగ్
మండలంలో 79.3శాతం పోలింగ్
ఆత్మకూరు, నవంబర్ 21: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక పోలింగ్ ఆత్మకూరు మండలంలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 55 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయ. పోలింగ్ ఉదయం మందకొడిగా సాగింది. ఆత్మకూరు మండలకేంద్రంలో కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి 98వ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దామెర, ఆత్మకూరు గ్రామాల్లో బిజెపి అభ్యర్థి పగిడిపాటి దేవయ్య పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మండలంలోని కటాక్షాపూర్ గ్రామం పోలింగ్‌కేంద్రం వద్ద 5 నిమిషాల పాటు ఈవి ఎంలు మొరాయించాయి. మండలంలో 44,485 ఓట్లకు గాను 35,311 ఓట్లు పోలయ్యాయి. చౌళ్లపల్లిలో అత్యధికంగా 94 శాతం పోలైంది. అత్యల్పంగా 69 శాతం పోలింగ్ నమోదైంది.