వరంగల్

వైభవంగా మల్లిఖార్జున స్వామి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 15: గూడూరు మండలం మచ్చర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గల దేవునిగుట్టపై ప్రతి ఏడాది జరిగే మల్లిఖార్జున స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. గత 43 సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగ రోజున శ్రీమల్లిఖార్జున స్వామి జాతర ప్రారంభం అవుతుంది. శుక్రవారం సాయంత్రం శోభయాత్ర, ఊరేగింపుగా స్వామిని వారిని దేవునిగుట్టకు చేర్చారు. శనివారం మహా గణపతి పూజ, పుణ్య మహావచనము, అంకురారోపణము, రుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. సాయంత్రం ఒగ్గు కథా కాలక్షేపాన్ని కళాకారులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఆదివారం శివపూజ, కళ్యాణం వైభవంగా జరిగాయి. కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మకు బోనాల ఉత్సవం నిర్వహించారు. జాతర నిర్వహణ కమిటి, అయిన యాదవ సంఘం ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేశారు. శ్రీమల్లిఖార్జున స్వామి వారి మొక్కులు చెల్లించుకోవటానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. మల్లన్న, మేడలమ్మ, కేతమ్మల దేవతలను దర్శించుకున్న భక్త జనం పూనకాలతో భక్తి పరవశులయ్యారు. జాతరలో శ్రీమల్లిఖార్జున స్వామి వారి చరిత్రను తెలుపుతూ ఒగ్గు కథ కళాకారులు తమ వాయిద్యాలతో జాతరకు వచ్చిన భక్తులను ఆకట్టుకున్నారు. స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పూనకాలతో భక్తులు నాట్యం చేశారు. స్వామి వారిని బిజెపి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు యాపశెట్టి సీతయ్యతో పాటు గూడూరు మండల నాయకులు జంగ విమలాకర్, బత్తుల లక్ష్మణ్, మేరెడ్డి సురేందర్, సమ్మెట సుధాకర్, పేరాల సురేందర్, భాస్కర్, మేర్గు మల్లయ్య, రాచకొండ కొమురయ్య తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఏర్పాట్లను మచ్చర్ల యాదవ సంఘం పెద్ద గొల్ల కాడబోయిన నర్సయ్య, సారగొల్ల గజ్జి రాములు పర్యవేక్షించారు. అదే విధంగా ఉత్సవ కమిటి బాధ్యులు సుధాకర్, హుస్సేన్ యాదవ్, భద్రయ్య, చంద్రయ్య యాదవ్, పిచ్చయ్య, ఐలయ్య భక్తులకు సేవలందించారు.

అశ్రునయనాల మధ్య ఆదిలక్ష్మి అంత్యక్రియలు
* ఎర్రబెల్లిని పరామర్శించిన ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు
* శోకసంద్రంలో పర్వతగిరి గ్రామ ప్రజలు
పర్వతగిరి, జనవరి 15: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తల్లి ఆదిలక్ష్మి(86) గతకొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పరమపదించారు. ఆమె మృతి వార్త తెలిసిన పర్వతగిరివాసులు, ఎర్రబెల్లి అభిమానులు, కార్యకర్తలు, ప్రజానాయకులు, అధికారులు దయాకర్‌రావును కలిసి పరామర్శించారు. ఎర్రబెల్లి ఆదిలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమార్తెలు యశోద, ఆనంతలక్ష్మి, నళిని, కుమారులు దయాకర్‌రావు, ప్రదీప్‌రావు. దయాకర్‌రావు తల్లి మరణవార్తను తెలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మొదట శనివారం ఫోన్‌లో సంతాపం తెలిపారు. ఆదివారం ఉదయం 11-30 నిమిషాలకు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో పర్వతగిరికి చెరుకుని ఆదిలక్ష్మి మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆదిలక్ష్మి అంత్యక్రియలలో భాగంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. చౌరస్తా మీదుగా అంగడి వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వేలసంఖ్యలో ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు దహన సంస్కారాలు నిర్వహించారు.
పరామర్శించిన నేతలు...
ఎర్రబెల్లి దయాకర్‌రావును, ఆయన సోదరుడు ప్రదీప్‌రావును అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, గిరిజన సంక్షేమం, టూరిజం శాఖ మంత్రి చందులాల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపిలు పసునూరి దయాకర్, సీతారాం నాయక్, వినోద్‌కుమార్, మాజీ ఎంపిలు సిరిసిల్ల రాజయ్య, సిహెచ్ జంగారెడ్డి, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, చల్ల ధర్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మాగంటి గోపినాద్, అరికెపూడి గాంధీ, రెడ్యానాయక్, ప్రకాష్‌గౌడ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కిషన్‌రావు, గొర్రెలు, మేకలపెంపకం దారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ నగర మేయర్ నరేందర్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీ్ధర్, వన్నాల శ్రీరాములు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, బస్వారాజు సారయ్య, మందాడి సత్యరాయణరెడ్డి, ధర్మారావు, సుధాకర్‌రావు, గండ్ర రమణారెడ్డి, కవిత, సత్యవతి రాథోడ్, వేం నరేందర్‌రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు, ఇతర అధికారులు కలుసుకుని పరామర్శించారు.