వరంగల్

ఇక ఓరుగల్లు ప్రజలకు విమానయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 15: తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలలో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా విమాన సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో రాష్ట్రంలో హైద్రాబాద్ తరువాత పెద్దనగరంగా పేరున్న వరంగల్‌లో విమానాశ్రయ పునరుద్ధరణ, ప్రజలకు విమానయోగం తప్పనిసరిగా లభించనుంది. విమాన సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వ ప్రతిపాదించిన నగరాలలో వరంగల్ అగ్రభాగంలో ఉండటం, ప్రయోగాత్మకంగా వరంగల్‌కు విమాన సదుపాయ కల్పించాలనే ఆలోచన అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రప్రభుత్వానికి ఉండటంతో త్వరలో విమనాశ్రయ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమవుతాయనే అభిప్రాయం ఇటు ప్రజాప్రతినిధులలో, అటు అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజాం హయాంలోనే వరంగల్ నగర శివారులోని మామునూరులో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుచేసారు.
అవసరాల మేరకు అప్పట్లో తేలికపాటి విమానాలు నడిపేవారు. కానీ ప్రజల నుంచి పెద్దగా స్పందన లేని కారణంగా విమానాలు నడపలేని స్థితిలో కొన్ని సంవత్సరాల తరువాత ఎయిర్‌స్ట్రిప్ మూతపడింది. అధికారులు పట్టించుకోని కారణంగా ఈ ఎయిర్‌స్ట్రిప్‌కు చెందిన విలువైన భూములు కొన్ని ఆక్రమణకు గురయ్యాయి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టాక వరంగల్‌లో మినీ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మూతపడిన మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ను తెరచి ఆధునిక సదుపాయల ఏర్పాటు ద్వారా విమానాశ్రయాన్ని ప్రారంభించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. కానీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 200కిలో మీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో విమానాశ్రయ ఏర్పాటు ప్రతిపాదన ఫైళ్లకే పరిమితం అయింది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమ సందర్భంగా, ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటును టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వస్తే వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు తప్పనిసరని హామీ ఇచ్చారు. గడచిన రెండున్నర ఏళ్లుగా రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయ ఏర్పాటుపై ప్రకటనలు చేయటం, స్థలసేకరణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించటం తప్ప నిర్మాణాత్మక చర్యలు కనిపించలేదు.
వరంగల్ ప్రాంతంలో ఐటి హబ్ ఏర్పడుతుండటం, టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు మొదలవటం, పలు కేంద్రస్థాయి, రాష్టస్థ్రాయి విద్యాసంస్థలు ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో వరంగల్‌ల విమానాశ్రయ ఏర్పాటు తప్పనిసరి అని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. తాజాగా పది రోజుల క్రిందట ఢిల్లీలో కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్టమ్రంత్రి కె.తారకరామారావు సమక్షంలో కేంద్ర విమానయాన శాఖ అధికారులు, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఎంఓయు కుదుర్చుకోవటంతో ఇక వరంగల్ ప్రజలకు విమానయోగం తప్పనిసరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించటం పెద్ద సమస్యేమి కాదని, రాష్ట్రప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తే, కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తే రెండేళ్లలో వరంగల్‌లో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేయవచ్చని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు.