వరంగల్

వ్యాయామంతో అదుపులో మధుమేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్యసంస్థ గణంకాల ప్రకారం ప్రతి 11 మందిలో ఒకరికి మధుమేహ వ్యాధి ఉందని కాళోజీ హెల్త్‌యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అయితే మధుమేహ వ్యాధిని వ్యాయామంతో అదుపులో ఉంచవచ్చని ఆయన అన్నారు. జీవనశైలిలో మార్పు అవసరమని, ప్రతి రోజు అరగంట పాటు వ్యాయామం చేయడం మంచిదన్నారు. ఆహార అలవాట్లలో కూడా మార్పులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ స్థూలకాయం ఉన్నవారికి మధుమేహ వ్యాధి సోకుతుందని, దాని నుండి రక్షించుకునేందుకు వ్యాయామమే ముఖ్యమన్నారు. మానవుడు వాయామం, వాకింగ్‌తోనే పూర్తి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలసముద్రం నుండి ప్రారంభమైన ర్యాలీని వరంగల్ నగర కమిషనర్ సుధీర్‌బాబు జెండా ఊపి ప్రారంభించగా అక్కడి నుండి ర్యాలీ పబ్లిక్ గార్డెన్ వరకు చేరుకుంది.