వరంగల్

వరంగల్ అగ్నిగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 12: భానుడు పగబట్టాడు. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వరంగల్ అగ్నిగుండంగా మారింది. మంగళవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. బలమైన వేడి గాలులతో జనం విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం వరకు ఎండలు మరింత ఎక్కువై రోడ్లపై జనాలు తిరగడం లేదు. వరంగల్ నగరమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటల వరకే పనులు ముగించుకొని ఇంటిముఖం పడుతున్నారు. రాత్రి 7 గంటల తరువాతే తిరిగి పనులు చేసుకోవడానికి ప్రజలు బయటకు వస్తున్నారు. ఏప్రిల్ మాసంలోనే ఎండల పరిస్థితి ఇలా ఉంటే ఇక మేలో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు. గడిచిన 15 రోజులుగా వడదెబ్బకు జిల్లాలో వంద మందికి పైగా మృత్యువాతపడ్డారు. రోజురోజుకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలకు వడదెబ్బకు ఎక్కువగా గురవుతున్నారు. జిల్లా యంత్రాంగం కూడా వడదెబ్బలకు స్పందిస్తూ వడదెబ్బ నుండి బయటపడేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎండ వేడమి నుండి ఉపశమనం పొందేందుకు గాను ప్రజలు శీతల పానియాలు, కూల్‌డ్రింక్స్, కొబ్బరిబొండాలకు గిరాకీ పెరిగింది. నెత్తిపై టోపీలకు కూడా భలే గిరాకీ ఉంది. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చే వారు ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతటి ఎండలు దాదాపు పాతికేళ్లుగా ఎప్పుడూ చూడలేదని కొందరు వృద్ధులు చెపుతున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఎండలపైనే చర్చ జరుగుతుంది. ఓ వైపు ఎండలు, మరో వైపు ఉక్కపోతతో జనం అతలాకుతలమవుతున్నారు. అయితే వాతావరణ శాఖ మాత్రం ఈ ఏడు ముందస్తుగానే వర్షాలు పడుతాయని చెపుతుండడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది.