వరంగల్

చెరువుల పునరుద్ధరణతో రైతులకు ఎంతోమేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ విడత కార్యక్రమాన్ని మంగళవారం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం బోజెరువు చెరువులో పనులను ప్రారంభించారు. ముందుగా నర్సంపేట డిఎస్పీ మురళీధర్, టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దిసుదర్శన్‌తో కలిసి బోజెరువు చేరుకున్న ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝాకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో ఎడ్లబండ్ల మీద చెరువు వద్దకు చేరుకొని రూరల్ పోలీస్ శాఖ దత్తత తీసుకున్న బోజెరువు పూటిక తీత పనులను పలుగు పార పట్టి పనులను ప్రారంభించారు. ఎస్పీ స్వయంగా జెసిబి వాహనాన్ని నడిపారు. అనంతరం చెరువు సమీపంలో గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా మాట్లాడుతూ గ్రామీణుల జీవితం రైతుల జీవితాలు చెరువుతో ముడిపడి ఉంటాయని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. పోలీసు శాఖ దత్తత తీసుకున్న బోజెరువు గ్రామ చెరువు పరిసర ప్రాంతాల్లోని అన్నదాతలు పూడికమట్టి తీసి తమ పంట పొలాల్లోకి తరలించుకోవాలన్నారు. పూడిక తీత పనులు త్వరగా పూర్తికావాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. పోలీసులు సైతం గ్రామస్థులతో స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పని చేసి సకాలంలో చెరువుపూడికతీత పనులతో పాటు చెరువు చుట్టూ మొక్కలు నాటాలన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త పంథాలో స్నేహపూర్వక పోలీసింగ్‌తో జిల్లాపోలీసులు ముందుకు సాగాలని, పోలీసులంటే ప్రజలు భయపడే పరిస్థితులు ఉండవద్దని అన్నారు. పౌరులు స్వేచ్ఛగా పోలీసులతో మమేకమయ్యేందుకు మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయని ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఎస్పీ ఆకాంక్షించారు. చెరువుల్లోని నల్లటి పూడికమట్టి గంగానది పూడిక మట్టిని తలపిస్తుందని, రైతులు తమ పంట పొలాలకు పూడికమట్టిని తరలించుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట రూరల్ సిఐ బి.కిషన్, గూడూరు సిఐ రమేష్‌నాయక్, ఇరిగేషన్ డిఇ సుదర్శన్, బోజెరువు సర్పంచ్ కొమురయ్య, ఎంపిటిసిలు ఇంద్రసేనారెడ్డి, నాగలక్ష్మీ, చెన్నరావుపేట జెడ్పిటిసి రాంరెడ్డి, ఎంపిపి అశోక్, ఎస్సైలు, గ్రామస్థులు పాల్గొన్నారు.