వరంగల్

గిరిజన మంత్రి సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, ఏప్రిల్ 12: మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఉదయం ములుగులోని టిఆర్‌ఎస్ కార్యాలయంలో ఏటూరునాగారం ఐటిడిఎ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అక్కడి నుండి మండలంలోని అన్నంపల్లి గ్రామశివారులోని తొర్రుకుంట చెరువుకు రూ. 13 లక్షల 38 వేలు మంజూరు కాగా మిషన్ కాకతీయ రెండోదశ కింద మరమ్మతు పనులను ప్రారంభించారు. అదేవిధంగా జగ్గన్నపేట గ్రామంలోని ఊరచెరువుకు రూ.31లక్షల 35వేలు మంజూరు కాగా మరమ్మతు పనులను ప్రారంభించారు. అనంతరం మండలంలోని మల్లంపల్లిలో రూ.39లక్షలతో నిర్మించనున్న 7500బస్తాల నిల్వ సామర్థ్యం కలిగిన వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, మండల పార్టీ అధ్యక్షుడు గట్టు మహేందర్, జగ్గన్నపేట సర్పంచ్ శిరీష ఆదిరెడ్డి, ఎంపిటిసి పోరిక గోవింద్‌నాయక్, నాయకులు కేశెట్టి కుటుంబరావు, కిషన్‌నాయక్, పూర్ణచందర్, శ్రీనివాసరెడ్డి, రియాజ్‌మీర్జా, ఎండి.ఖాసీం, ఓరుగంటి మొగిలి, అనిల్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.