వరంగల్

ఆదుకోకపోతే ఆందోళన తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, ఏప్రిల్ 12: కరవు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోకపోతే ఆందోళన తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో ఎండిన పంటలను బుధవారం చాడ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు గొట్టేటి వెంకన్న మట్లాడుతూ తనకున్న రెండున్నర ఎకరాల్లో వరిచేను వేస్తే రూ.30వేల పెట్టుబడి పెట్టానని, సాగునీటి కోసం బోరు వేయగా మరో రూ.65వేల ఖర్చు అయిందని, ప్రస్తుతం 10బస్తాల ధాన్యం చేతికందె పరిస్థితి లేదని తమ గోడు వినిపించాడు. అలాగే ఎరబోయిన వేణు, పద్మలు మాట్లాడుతూ తమ మూడెకరాల చేను పూర్తిగా ఎండిపోయి అప్పులపాలవుతున్నామని, ఇక ఇళ్లు విడిచి పట్నం వలసలు వెళ్లే కష్టం వచ్చిందని రోదిస్తూ వివరించారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదలను పట్టించుకునే స్థితిలో లేదని, వారి స్వార్థం కోసం పనికొచ్చే పనుల పైనే దృష్టి పెడుతున్నారని అన్నారు. కరవు మండలాలుగా ప్రకటించి చేతులెత్తేశారని విమర్శించారు. గ్రామాల్లో కరవు విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం అనవసరమైన కార్యక్రమాల కోసం కోట్లు ఖర్చు పెడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి సత్యం, నాయకులు పాతూరి సుగుణమ్మ, నియోజకవర్గ కార్యదర్శి బర్ల శ్రీరాములు, నాయకులు ఆకుల శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి, జక్కయ్యలు పాల్గొన్నారు.