వరంగల్

ఆశలు చిగురించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జనవరి 1: కోటి ఆశలతో కొత్త సంవత్సరం రానే వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తున్న మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఈ సంవత్సరం అయినా పట్టాలెక్కేనా? విభజన చట్టంలో భాగంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సాధ్యాసాధ్యాలపై నివేదిక తెప్పించుకున్న కేంద్రం గత రెండేళ్లుగా నానుస్తూ వస్తుంది. ఈ యేడాది బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సంవత్సరం తీసుకునే నిర్ణయం అధికార పార్టీ నాయకుల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఫలితంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై నిరుద్యోగ యువకులు కూడా గంపెడాశలు పెంచుకున్నారు. ఇప్పటికే బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీపై అఖిలపక్షం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు జరిగాయి. మరోవైపు గత యేడు పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులకు కూడా ఈ సంవత్సరం మోక్షం కలిగే అవకాశం లేకపోలేదు. మరో ఏడాదిన్నరలోనే ఎన్నికలు ఉన్నందున ప్రజాప్రతినిధులంతా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టారు. అయితే జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఇప్పటివరకు నత్తనడకలో జరుగుతుండగా ఇక డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచేందుకు కసరత్తులు చేస్తున్నారు. జిల్లాలోని తొర్రూరులో త్వరలోనే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవాల్లో అధికారులు వేగం పెంచారు. అదేవిధంగా మరో మూడు నెలల్లో జిల్లాలో ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పనులు కూడా ఊపందుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పెండింగ్ పనులు పూర్తిచేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది.

వెంకటాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
* ముగ్గురి పరిస్థితి విషమం
వెంకటాపురం(నూగూరు), జనవరి 1: వెంకటాపురం-్భద్రాచలం ప్రధాన రహదారిలో సోమవారం సాయత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయాపడిన్నట్లు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజపూర్ జిల్లా దర్మారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో చెర్ల వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో సోడి ముత్యంతో పాటు మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. నడుం, కాళ్లు, చేతులు విరిగి ఎముకలు బయటికి రావడంమే కాకుండా, తీవ్ర రక్త మడుగులో పడియున్న క్షతగాత్రులను వైద్యం కోసం భద్రాచలం తరలించారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెంకటాపురం పోలీస్ స్టేష్‌న్‌కు భద్రాచలం నుండి సమాచారం వచ్చిన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.