వరంగల్

ఘనంగా బ్రెయిలీ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,జనవరి 20: విద్యావంతులైన, మంచి మనసున్న అంధుల లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయలీ చిరస్మరణీయుడని జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరుపున జిల్లా స్ర్తి,శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్రెయలీ 209వ జయండిని శనివారం స్థానిక ఎస్‌విఎం ఫంక్షన్‌హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ జ్యోతి ప్రజ్వలన చేసి కేక్‌కట్‌చేశారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. లాయి బ్రెయిల్ తన 4సంవత్సరాల వయస్సులోనే ప్రమాధవశాత్తు రెండు కళ్లు పోయాయన్నారు. 1784లో పారిస్‌లో అందుల పాఠశాలలో చేరి అప్పటికే ఉన్న లైన్‌టైమ్ విద్యను అభ్యసించాడు. అందులకు అనువైన బ్రెయలీ లిపి కోసం అదే పాఠశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ విశేషమైన కృషి చేశాడన్నారు. లిపి స్పర్శపై ఆధారపడి ఉందని అక్షరాలు ఉబ్బెత్తు చుక్కలుగా ఉండాలని గుర్తించి 6చుక్కలతో బ్రెయిలీ లిపిని రూపొందించిన మహనీయుడు బ్రెయలీ అని కొనియాడారు. బ్రెయిల్ తన 43వ ఏట క్షయవ్యాధితో బాధపడుతూ మరణించాడన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 15 మిలియన్లు అందులు ఉన్నారని అందులో 5శాతం మాత్రమే చదువుకుంటున్నారన్నారు. భారతదేశంలో 35 శాతం మంది ఉన్నారన్నారు. అందులో ప్రభుత్వ ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతిభావంతులైన అంధులకు జేసీ మెమెంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. లూయి బ్రెయిలీ లిపికి చేసిన కృషి చీరస్మరణీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ గిరిధర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రాజు, స్వర్ణలతలెనినా, చైల్డ్‌ప్రొటెక్షన్ అధికారి కళా ప్రవీణ్, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు అనుమాండ్ల వెంకటేశ్వర్‌రావు, చంద్రదేవ్, అందులు పాల్గొన్నారు.