వరంగల్

నిలిచిన పత్తి కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఫిబ్రవరి 16: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి వ్యాపారులు బస్తాలపై లాట్ నెంబర్లు వేయడం లేదనే కారణంతో పత్తి కొనుగోళ్లకు రాలేదు. దీనితో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు నిరీక్షించిన రైతులు కార్యాలయం ఎదుట అందోళనకు దిగారు. అయినా మార్కెట్ అధికారులు, సిబ్బంది స్పందించడం లేదని ఆరోపిస్తూ కార్యాలయంలోకి రైతులు చొచ్చుకు వచ్చి కార్యదర్శి, సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేయడానికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ ఐ శ్రీనివాస్‌రెడ్డి, పోలీసులు వచ్చి రైతులను బయటకు పంపారు. కార్యాలయం ఎదుట గేటు వద్ద రైతులు గంట పాటు ఆందోళన చేశారు. తాము పొద్దట్నుంచి మార్కెట్లో పడిగాపులు పడుతున్నామని, కనీసం మద్యాహ్నం తరువాత వ్యాపారులు పత్తి ఖరీదు చేయడానికి రావడం లేదనే విషయాన్ని తమకు తెలిపితే మహబూబాబాద్ తీసుకెళ్లేవారమని, సాయంత్రం వరకు నిరీక్షించి తామే కార్యాలయానికి వస్తే తీరా వ్యాపారులు రావడం లేదన్న చావు కబురు చల్లగా చెబుతున్నారని ఆరోపించారు. రైతులంటే ఇంత నిర్లక్ష్యమా.. మీరు ఇక్కడ ఎందుకున్నారని మార్కెట్ అధికారులను, సిబ్బందిని నిలదీశారు. మార్కెట్లో రైతులకు ఇబ్బందులు కలిగితే అటు పాలకమండలి, ఇటు అధికారుల్లో ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాగా వ్యాపారులు మాట్లాడుతూ పత్తిలో కొందరు రాళ్లు పెట్టి తెస్తున్నారని, మరికొందరు నీళ్లు చల్లి తెస్తున్నారని, దీనితో తాము నష్టపోతున్నామని, ఎవరు తమను మోసం చేస్తున్నారనే విషయం తెలియడానికి బస్తాలపై లాట్ నెంబర్లు వేయాలని మార్కెట్ అధికారులకు తెలిపితే పట్టించుకోవడం లేదని, అందువల్లే తాము ఖరీదులు నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. ఎస్‌ఐ, కార్యదర్శి అంజిత్‌రావు పత్తి వ్యాపారులతో ఫోన్‌లో చర్చలు జరపి, ప్రస్తుతం రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని నచ్చజెప్పడంతో పత్తి వ్యాపారులు బచ్చు పరమేశ్వర్, తోకల శ్రీనివాస్‌రెడ్డి పత్తి ఖరీదులకు ముందుకు వచ్చారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో టెండర్లు వేయడం, బిడ్ ఓపెన్ చేయడం, కాంటాలు వేయడానికి సమయం అనుకూలించదని తేల్చి చెప్పడంతో శనివారం ఉదయం 8 గంటలకే టెండర్లు వేసి, 11 గంటలకల్లా కాంటాలు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. దీనితో పత్తి విక్రయానికి తెచ్చిన రైతులంతా శుక్రవారం యార్డులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది.

ఆసరా పింఛన్లకు ‘పది’ కాయన్లు!
కేసముద్రం, ఫిబ్రవరి 16: ఆసరా పథకంలో పింఛన్ల పంపిణీ కోసం పోస్ట్ఫాసు ద్వారా పది నాణాలను పంపించడంతో చిల్లర లెక్కించలేక గ్రామీణ పోస్ట్‌మాస్టర్లు, లబ్ధిదారులు సతమతమవుతున్నారు. కేసముద్రం సబ్‌పోస్ట్ఫాసు పరిధిలోని 18 గ్రామాల పోస్ట్ఫాసుల్లో ఆసరా పథకంలో పింఛన్ల పంపిణీకి కోటి 52 లక్షల రూపాయలు అవసరం కాగా ఈ నెల ఇప్పటి వరకు 70 లక్షలు మాత్రమే ఇచ్చారు. దీనితో సగం మంది వరకు పింఛన్లు ఇవ్వగా మిగిలిన సగం మందికి నగదు అందుబాటులో లేక ఇవ్వలేక పోయారు. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్ట్ఫాసు పరిధిలో ఆసరా పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం సబ్‌పోస్ట్ఫాసుకు బ్యాంకుల ద్వారా 50 వేల రూపాయలను సమకూర్చింది. అయితే, ఇందులో 30 వేల రూపాయలు 2వేలు, 500, 200, 100 నోట్లు కాగా మిగిలిన 20 వేలలో 10 వేలు పది రూపాయల నోట్లు, మరో 10 వేలు పది రూపాయల నాణాలను పంపిణీ చేశారు. దీనితో చిల్లర నాణాలు తీసుకెళ్లిన పోస్ట్‌మాస్టర్లు పింఛన్‌దారులకు అందించేందుకు నానాయాతన పడ్డారు. కాగా, కొందరు పది రూపాయల నాణాలను తీసుకోవడానికి ముఖం చాటేయగా, మరి కొందరు ఏదో ఒకటి తీసుకోకపోతే మళ్లీ ఎప్పుడొస్తాయోనని తీసుకెళ్లారు. గతంలో 2 వేల రూపాయల నోట్లు పంపిణీ చేసేవారని, ఇప్పుడిలా చిల్లర నాణాలు పంపిణీ చేస్తుండటంతో వాటిని తీసుకెళ్లడం భారంగా మారడంతో పాటు లెక్కించడం కష్టంగా మారిందంటున్నారు.