వరంగల్

వాడి వేడిగా గ్రేటర్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 23: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నగర మేయర్ నన్నపనేని నరేందర్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మీడియాను అనుమతించక పోవడంతో ప్రతిపక్ష కార్పొరేటర్లు నిరసన తెలిపారు. సమావేశానికి ముందుగా ఇటీవలే 44వ డివిజన్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన అనిశెట్టి సరిత కౌన్సిల్ హాల్లో ప్రమాణస్వీకారం చేసారు. ఆతరువాత సమావేశం గరం.. గరంగా నడిచింది. టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై కార్పొరేటర్లు మండిపడ్డారు. భవనాలకు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మానాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారుల చేతివాటంతో గ్రేటర్ పరిధిలో అనేక అనుమతి లేని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారుల అవినీతి వల్ల విచ్చల విడిగా భవన నిర్మానాలు జరుగుతున్నాయని ఈసందర్భగా అధికారుల తీరును ఎండగట్టారు. ప్రతిపక్ష కార్పొరేటర్లకు తోడు అధికార పార్టీ కార్పొరేటర్లు పట్టు పట్టడంతో మేయర్ నరేందర్ తీవ్రంగా స్పందిచాడు. అక్రమ భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారుల తీరుపట్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదన్నారు. మడికొండలో తక్షణమే డంపింగ్ యార్డు ఎత్తివేయాలని స్ధానిక కాంగ్రెస్ కార్పొరేటర్ తొట్ల రాజు, మరికొందరు కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. అదే విధంగా అపార్టుమెంట్‌లలో నీటిపన్ను పెంచాలని అధికారులు చేసిన తీర్మానానికి కౌన్సిల్‌సభ్యులు వ్యతిరేకించడంతో వాయిదా వేసారు. అపార్టు మెంట్‌లలో ఇప్పటి వరకు యూనిట్‌కు 15రూపాయలు ఉండగా 50రూపాయలకు పెంచాలని చేసిన తీర్మానానికి మెజార్టీ సభ్యులు వ్యతిరేకించారు. గ్రేటర్ పరిధిలో విలీనమైన గ్రామాలలో గొర్ల పథకం వర్తింపచేయాలని సభ్యులు పట్టుబట్టారు. అదే విధంగా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి రూ.1కే నల్ల కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా విలీన గ్రామాలలో సాదాబైనామా వర్తింపచేయాలని అన్నారు. కౌన్సిల్‌లో మొత్తం 9 అంశాలు ప్రవేశపెట్టారు. సమావేశంలో మున్సిపల్ కమీషనర్ శృతిఓజా, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండ సురేఖ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.