వరంగల్

ఆ బాధ్యత పోలీసులదే * సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలి * సీపీ రవీందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 20: ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ కమిషనర్ రవీందర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిషనరేట్‌కు చేందిన డీసీపీ, ఏసీపీ, ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు. ఈ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారిగా పోలీసు అధికారుల పనితీరుతో పాటు నమోదైన కేసుల స్ధితి గతులు, నిందితుల అరెస్టులపై సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ ఫిర్యాదుదారుడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఒకే రకమైన సేవలందించాలని, ప్రజలు చెల్లించే పన్నులతో మనకు జీతాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలకు భరోసా కల్పించాల్సినప బాధ్యత మనపై ఉందని అన్నారు. నేరాలు లేకుండా శాంతి భద్రతలు కలిగివున్న సమాజ స్థాపన పోలీసుల పనీతీరుకు నిదర్శనంగా నిలుస్తుందని, పోలీసుల పట్ల మరింత నమ్మకాన్ని పెంపొందించేందుకు గాను పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని ముఖ్యమైన కూడళ్ళలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని అన్నారు. పోలీసులు కార్డన్ సర్చ్ లేదా పెట్రోలింగ్ లాంటి విధులు నిర్వహించే సమయంలో వెరిఫికేషన్, ఆప్లికేషన్ వినియోగించాలని, అదే విధంగా గ్రామీణా, నగరంలో నేను సైంతం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటకు పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలను ప్రోత్సహించాలని అన్నారు. పోలీస్ అధికారులు తాము చేయాల్సిన విధులపై అవగాహన కలిగివుండాలని, కోర్టు కానిస్టేబుళ్ల పనీతరుపై ఏసీపీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు మల్లారెడ్డి,వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీలు పూజ, అశోక్ కుమార్‌తో ఎపాట ఎసీపీలు, తదితరులు పాల్గొన్నారు.

* గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా
* రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఆదేశం
మహబూబాబాద్, ఏప్రిల్ 20: మే చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30లోగా గ్రామపంచాయతీల వారిగా ఓటర్లజాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ నుండి జిల్లా అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలకు కొత్త సాఫ్ట్‌వేర్ కమిటీ సిబ్బందికి అసెంబ్లీ ఓటర్ల జాబితా నుండి గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారు చేయడంలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించి జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. మే 1వ తేదీన జిల్లాస్థాయిలో వివిధ రాజకీయ పార్టీలతో, మే 3వ తేదీన మండలస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మే 1 నుండి 8వరకు అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలని అట్టి అభ్యంతరాలను మే 10నాటికి పరిష్కరించాలని చెప్పారు. తుది గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలు మే 17న ప్రకటించాలన్నారు. తుదిజాబితాను గ్రామపంచాయతీలో గ్రామంలోని మూడు ప్రదేశాల్లో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రదర్శించాలని చెప్పారు. జూన్ 30నాటికి స్థానిక ప్రజాప్రతినిధుల పదవికాలం ముగియనున్నందున మే చివరి నాడు ఎన్నికలు నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 4,88,467 మంది ఓటర్లు ఉన్నారని, రెండు రెవెన్యూ డివిజన్లు, ఒక నగర పంచాయతీ, 16 మండలాలు, 13 మండల పరిషత్‌లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 222 పాత, 239 కొత్త మొత్తం 461 గ్రామపంచాయతీలు ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కొత్త జీపీలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు ఎంపీడీవోలను ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీవో వైవీ గణేష్, జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు పాల్గొన్నారు.