వరంగల్

ప్రకృతి ప్రకోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే15: వరంగల్ నగరంపై పకృతి మరోసారి విరుసుక పడింది. సోమవారం రాత్రి ఒక్క సారిగా గాలి, దుమారానికి తోడు భారీ వర్షం పడటంతో నగరం అతలాకుతలమైంది. బలమైన గాలి దుమారానికి ప్రధాన రోడ్లపై ఉన్న చెట్లు నెలమట్టమైనాయి. విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. ఇంటిపైకప్పులు లేచిపోయాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంబాలు కిందపడిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నగరమంతా చేకటిమయమైంది. నగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు రాత్రంతా అంధాకారంలోనే ఉన్నాయి. మరో వైపు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. తడిసిన ధాన్యంతో రైతులు నిండామునిగారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్మకానికోసం మార్కెట్‌కు తీసుకవస్తే డబ్బుచేతికి వచ్చే సమయంలో ఇలా అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈవారంలోనే వరంగల్ నగరంలో మూడు సార్లు అకాల వర్షం, గాలి దుమారానికి రైతులు తీవ్ర నష్టానికి గురైనారు. మంగళ వారం ఉదయం నుండి విద్యుత్ మరమ్మతు చర్యలు చేపట్టారు.