వరంగల్

పెట్రోల్, డీజీల్ ధరలపై భగ్గుమన్న కామ్రేడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 21: పెట్రోల్, డీజీల్ ధరలపై పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై కామ్రేడ్స్ బగ్గుమన్నారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలో నిరంతరం పెట్రో ధరలు పెంచుతూ నరేంద్రమోడీ సర్కార్ సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు గగ్గోలు పడుతున్నారని అన్నారు. ఇటీవల కర్నాటక ఎన్నికలు ముగియగానే వరుసగా పెట్రోల్ ధరలు పెంచుతూ పోతుందని అన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర పన్నులు కలుపుకొని లీటర్ పెట్రోల్‌కు 80.76 పైసలు కాగా డీజీల్‌కు 73.35 పైసలకు చెరుకున్నదని అన్నారు. పెట్రో ధరల పెరుగుదల వల్ల నిత్యవసరాలతో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని, తద్వారా సామాన్యులపై పెనుబారం పడుతుందన్నారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజీల్‌ను కూడా జీఎస్‌టీ లో చేర్చితే ధరలు తగ్గేవని నేడు కేంద్ర, రాష్ట్ర సుంకాలతో మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 శాతంపైగా ధరలు పెరిగాయని అన్నారు. పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలపై అన్ని పార్టీలను కలుపుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటి పాముల వెంకట్రాములు, నేదునూని జ్యోతి, జిల్లా సహాయకార్యదర్శి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.