వరంగల్

పోటెత్తిన మొక్కజొన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మే 22: పరకాల వ్యవసాయ మార్కెట్ మక్కలతో కళ కళలాడింది. మంగళవారం నుండి వ్యవసాయ మార్కెట్‌లో మక్కలను కొనుగోలు చేస్తామని పరకాల పీఎసీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి ప్రకటించడంతో పరకాల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గ్రామాల నుండి మంగళవారం ఉదయం నుండే మార్కెట్‌కు మక్కలను తరలించడం ప్రారంభించారు. మార్కెట్‌లో నిల్వ ఉన్న మక్కల బస్తాలను కాంటాలు వేసి గోదాంకు తరలించడానికి సోమవారం వరకు మక్కలను రైతులు మార్కెట్‌కు తీసుకురావద్ద పీఎసీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి పత్రిక ప్రకటన చేయడంతో రైతులు మక్కలను మార్కెట్‌కు తీసుకరాలేదు. మంగళవారం నుండి మక్కలను కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు తాము సాగు చేసిన మక్కలను మార్కెట్‌కు తరలించడంతో మార్కెట్ మొత్తం మక్కలతో నిండి పోయింది. ఏటు చేసిన మక్కల బస్తాలు, రాశులుగా పోసిన మక్కలతో పరకాల వ్యవసాయ మార్కెట్ కళకళలాడింది.
* ఒక్కరోజే 45వేల బస్తాలు ...
మంగళవారం ఒక్క రోజే 45 వేల మక్కల బస్తాలు మార్కెట్‌కు రావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. అంతేకాకుండా వాహనాల ద్వారా మక్కలను లోడ్ చేసుకొని మార్కెట్ బయట రైతులు ఎదురు చూస్తున్నారు. పరకాల మార్కెట్‌కు మంగళవారం ఒక్క రోజే సుమారు 45 వేల మక్కల బస్తాలు మార్కెట్‌కు వచ్చినట్లు పరకాల పీఎసీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి తెలిపారు.
మరో కొనుగోలు కేంద్ర ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి
పరకాల వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం ఒక్క రోజే 25వేల బస్తాలు రావడంతో మార్కెట్ మొత్తం మక్కలతో నిండి పోయింది. ఇప్పటికే మార్కెట్‌లో హమాలీల సమస్య ఉండగా మార్కెట్‌లో లోడ్ చేయడానికి మరో 15వేల బస్తాలు రైతులు తీసుక రావడంతో కలెక్టర్ దృష్టికి తీసుక వెళ్లినట్లు దేవేందర్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్ పరకాల పీఎసీఎస్ ఆధ్వర్యంలో మరో కొనుగోలు కేంద్ర ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో పరకాల పట్టణ శివారులోని చలివాగు వద్ద మిల్లులో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు పీఎసీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మక్కల తీసుక వెళ్లాలని కోరడంతో అక్కడికి మరో 15వేల బస్తాలు వచ్చినట్లు దేవేందర్‌రెడ్డి తెలిపారు. పరకాల పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికి వరకు సుమారు లక్ష మక్కల బస్తాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో లక్ష మక్కల బస్తాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు దేవేందర్‌రెడ్డి తెలిపారు.