వరంగల్

వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి,జూన్ 19: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జన్మదినాన్ని పురష్కరించుకుని కురవిలోని శ్రీవీరభద్రస్వామివారి ఆలయంలో మంగళవా రం రాహుల్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాటోతు హుస్సెన్‌నాయక్ మాట్లాడుతూ.. భారతదేశానికి కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీ అని అన్నారు. రాహుల్‌గాంధీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు రానున్న ఎన్నికల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌గాలి వీస్తుందని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని హుస్సెన్‌నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హుస్సేన్‌నాయక్ అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కురవి దేవాలయా న్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అంశాన్ని ఈ సందర్భం గా హుస్సేన్‌నాయక్ గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో రాహుల్‌సేవాసమితి బాధ్యులు చీకటి కిరణ్‌గౌడ్, లక్కర్సు అశోక్, సురేష్‌గుప్తా, రఫీ, ఖాసీం, సత్యనారాయణ, బొట్టు రమేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

హాస్టళ్ల రాష్ట్ర ప్రముఖ్‌గా రంజిత్‌కుమార్
కాటారం, జూన్ 19: తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ వసతి గృహాల రాష్ట్ర ప్రముఖ్‌గా పాగె రంజిత్‌కుమార్‌ను నియమిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పాగె రంజిత్‌కుమార్‌ను నియమించినట్లు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు మీసాల ప్రసాద్ వెల్లడించారు. పాగె రంజిత్‌కుమార్ 2007 నుంచి ఏబీవీపీలో కార్యకర్తగా కొనసాగుతున్నారు. వరంగల్ కార్యాలయ కార్యదర్శిగా, 2012 నుంచి క్రియాశీల కార్యకర్తగా, కర్నూలు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, ఆదిలాబాద్ జిల్లా విభాగ్ నిర్వాహక కార్యదర్శిగా అనేక బాధ్యతలను నిర్వహించారు.

చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం
* స్పీకర్ సిరికొండ
శాయంపేట, జూన్ 19: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో మెగటెక్స్‌టైల్ పార్క ఏర్పాటుతో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందని స్పీకర్ సిరికొండ మధుసూదచారి అన్నారు. మండల కేంద్రంలోని చేనే త సహకార సంఘంలో పనిచేస్తున్న చేనేత కార్మికులకు లలిత నర్సింగ్ హోమ్ పరకాల సహకారంతో పోప పరకాల ఆధ్వర్యంలో హెల్త్ కార్డుల పంపిణీకి ముఖ్యఅతిధిగా స్పీకర్ మధుసూదనాచారి హాజరైయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ శాయంపేట చేనేతకు పెట్టింది పేరని చేనేత కార్మికులకు త్వరలోనే అత్యోందయ కార్డులు అందిస్తామని తహశీల్ధార్ వెంకట్ భాస్కర్‌కు ఆదేశించా రు. సోసైటీ భవన అధునికరణకు 10 లక్షల రూపాయల మంజురు చేస్తానని అర్హులైన చేనేత కార్మికులకు ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ఉచితంగా వైద్యం అందించాలని కుల అభిమానంతో ముందుకు వచ్చిన డాక్టర్ రాజేశ్వర్ ప్రసాద్‌ను స్పీకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రప్రకాశ్, సర్పంచ్ వల్ఫ చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.