వరంగల్

‘కాకతీయ’తో చెరవులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, ఏప్రిల్ 29: మిషన్ కాకతీయ పనులతో ఎన్నో సంవత్సరాలుగా మరమ్మత్తులకు నోచుకోని చెరువులు కుంటలు పూర్తిస్థాయి పునర్‌నిర్మాణం జరుగుతున్నాయని వర్ధన్నపేట శాసన సభ్యుడు అరూరి రమేష్ అన్నారు. శుక్రవారం వర్ధన్నపేట మండలంలోని దొంగ చింత తండ శివారు గ్రామమైన బ్రాహ్మణ కుంటతండలో బ్రహ్మణకుంట పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ కుంట నిర్మాణం జరిగిందని, ప్రస్తుతం ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని అలాంటి కుంటను 19 లక్షల రూపాయలతో పునర్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ రెండవ దశ పనులను ప్రారంభించి వర్షాకాలం వచ్చే వరకు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. చెరువుపరిధిలో గల ప్రభుత్వ భూమిని కొంత మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారని రెవెన్యూ అధికారులు సర్వేచేయించి హద్దులు ఏర్పాటు చేయాలని గతంలో చెరువు ఎలావుందో అలానే పూర్తిస్థాయి మరమ్మత్తులు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రైతులు గుర్తించాలన్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ సంతరించుకుంటుందని, చెరువు నిర్మాణం పూర్తి అయితే జల వనరులు పెరిగి వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటుందని ఆయన అన్నారు. పేద, హరిజన, గిరిజన వర్గాల ప్రజల అభ్యున్నతికై కేసి ఆర్ అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని అందులోని బాగంగానే ఐనవొలు గ్రామంలో వరికోత యంత్రం సబ్సిడిపై అందించడం జరుగుతుందన్నారు. యాబై శాతం సబ్సిడిపై వరికోత యంత్రాన్ని ప్రభుత్వం మంజూరి చేసిందని ఈ రోజు లబ్దిదారులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమాలలో జడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి, ఎంపిపి మార్నేని రవీందర్‌రావు, సర్పంచ్ లచ్చిరాం,ఎంపిటిసి నూనావత్ వసంత్‌కుమార్, తోటకూరి రాజమణి, ఎండి అన్వర్, తదితరులున్నారు.