వరంగల్

ఇంకుడు గుంతలపై విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం నగరంలోని వడ్డెపల్లి పింగిళి డిగ్రీ కళాశాలలో ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే తరాలకు నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలని, అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో కూడా ఇంకుడు గుంతలు ఉండాలన్నారు. ఇంకుడు గుంతలపై ఈ నెల 2న టి ఆర్ ఎస్ శ్రేణులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహ్మన్, వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ పాల్గొంటారని అన్నారు. ప్రతి టి ఆర్ ఎస్ కార్యకర్త కూడా వారి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయనట్లైతే రాబోయే కాలంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
మరో లాథూర్‌లా కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం మేడే సందర్భంగా ఆయన కార్మికులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. మేడే ఉత్సవాలను ప్రతి కార్మిక అడ్డాలో ఘనంగా జరుపుకోవాలని కోరారు. అసంఘటిత, సంఘటిత కార్మికులను సంఘటిత పరిచి కార్మిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ అసంఘటిత రంగ కార్మికులకు అనేక రాయితీలు కల్పించారన్నారు. పెద్దపెద్ద కంపెనీలు కార్మిక చట్టాల పరిధిలోకి రాకుండా కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. ప్రతి కార్మికుడు లేబర్ ఆఫీసులో వారి పేర్లను నమోదు చేసుకోవాలని, అందుకు అవసరమైన సభ్యత్వ రుసుం తన స్వంత ఖర్చులతో చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు దాస్యం విజయ్‌భాస్కర్, శ్యామల, ఎం. స్వప్న, కార్మిక నాయకులు ఎం ఎస్ నారాయణ, సత్తెన్న, బీరన్నలు పాల్గొన్నారు.