వరంగల్

వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్కతుర్తి, జూలై 20: రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు విసుగుచెందారని, వచ్చే ఎన్నికల్లో కేం ద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖా యమని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీలు మాయ మాటలతో సంవత్సరాలు గడిపారని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలతో కాలం వెల్లబుచ్చుతున్నదే తప్పా చేసింది శూన్యమని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాను ఎంతో కృషి చేశానని, అనుభవించింది మాత్రం తెలంగాణ ద్రోహులే అధికారం ఏలుతున్నారని ఆయన దుయ్యబట్టారు. దేవాలయ అభివృద్ధి కోసం ప్రగ తి భవన్‌కు వెళ్తుండగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంతాజీ, మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే ప్రజా చైతన్య యాత్ర
* తెజస ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అంబటి శ్రీనివాస్
నర్సంపేట, జూలై 20: టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రం లో ఎండగట్టేందుకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ జన సమితి (తెజస) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అంబటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 9వరోజు ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి, పర్శునాయక్‌తండా, మాధన్నపేట, బోజ్యనాయక్‌తండా, భాంజీపేట, చంద్రయ్యపల్లె, రాజేశ్వర్‌రావుపల్లె, కమ్మపల్లి, దాసరి పల్లి, లక్నెపల్లి గ్రామాల్లో జరిగింది. ఈసందర్భంగా అంబటి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రశ్నించే వారిని అణిచవేస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో ప్రజలంతా బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. వాస్తవ సాగుదార్లకు, పోడు రైతులకు, కౌలు రైతులకు రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ఈనెల 23న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన రైతు దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బుల్లెట్ వెంకన్న కళాకారుల బృందం, జన సమితి నాయకులు షేక్ జావీద్, గంగిడి సాంబిరెడ్డి, భూక్య గోపాల్‌నాయక్, బొట్ల పవన్, అంబటి హన్మంతు, పొలబోయిన లక్ష్మయ్య, ఎర్రబోయిన రాజశేఖర్, నయిమ్, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.