వరంగల్

మంచినీటి ఎద్దడిపై మంత్రి చందూలాల్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగుటౌన్, ఏప్రిల్ 30 : నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంచినీటి కొరతను తీర్చేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సూచించారు. ములుగులోని ఆర్‌డిఒ కార్యాలయంలో శనివారం మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో నీటి కొరత ఉన్నట్లయితే అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను ప్రజలు నిర్మించుకునేలా చూడాలన్నారు. అవసరమైన చోట నీటివనరులను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేయాలని అన్నారు. అదేవిధంగా వర్షాలు వచ్చేలోపు మిషన్ కాకతీయ పనులను టెండర్ పూర్తయిన అగ్రిమెంట్‌కు రావడంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకేచోట కాంట్రాక్టర్లు గుంతలు తవ్వుతున్నారని, అలా కాకుండా సమానంగా పనులు చేపట్టాలని అన్నారు.అనంతరం ఆయా మండలాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై ఇంజనీర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూగర్భజలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతను నిర్మించుకోవాలని, మరుగుదొడ్లను కూడా నిర్మించుకునేందుకు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఇంటికి ఐదు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఈసమావేశంలో ములుగు ఆర్‌డిఒ చీమలపాటి మహేందర్‌జీ, ఏటూరునాగారం ఐటిడిఎ ఎపిఒ అమయ్‌కుమార్, ఎఎస్‌పి విశ్వజిత్ కంపాటి, ఆర్‌డబ్ల్యు ఎస్ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.