వరంగల్

‘నల్లబెల్లి’ స్పెషల్ అధికారులు వీరే ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లబెల్లి, జూలై 21: మండలంలోని సర్పంచ్‌ల పదవీకాలం ముగిస్తుండగా నూతనంగా ప్రభుత్వం స్పెషల్ అధికారలు నియమించినట్లు తెల్సింది. నల్లబెల్లి మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు స్పెషల్ అధికారులుగా నియమించినట్లు తెల్సింది. ఐతే నల్లబెల్లి, కొండాయిలపల్లికి గ్రామ పంచాయతీలకు స్పెషల్ అధికారిగా జె.హరిప్రసాద్ ఇవోపిఆర్డీ, నారక్కపేట, గుండ్లహాపాడ్, బజ్జుతండాకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరస్వతి, రాంపూర్, అర్శనపల్లి గ్రామాలకు వెటర్నరీ డాక్టర్ శారధ, రేలకుంట, నందిగామ పంచాయతీలకు నల్లబెల్లి తహాశిల్ధార్ రాజేంద్రనాద్, రుద్రగూడెం, నాగరాజుపల్లి గ్రామాలకు ఎంఇవో దేవా, ముచ్చింపుల, రంగాపురం, ముచ్చింపుల తండా పంచాయతీలకు వెటర్నరీ డాక్టర్ శ్రీనాథ్, శనిగరం, ధస్తగిరిపల్లి పంచాయతీలకు సిహెచ్ అంజయ్య, రాంతీర్ధం, ధర్మరావుపల్లి పంచాయతీలకు ఇన్‌చార్జి ఎంపీడీవో బాబు, బుచ్చిరెడ్డిపల్లి, కన్నారావుపేట, మామిండ్లవీరయ్యపల్లి పంచాయతీలకు డిప్యూటీ తహాశీల్ధార్ మురళీధర్‌రావు, గొల్లపల్లి, మేడపల్లికి టి సత్యనారయణ స్వామి, గోవింధపురం, మూడుచెక్కలపల్లి కొండాపురంకు కె.కల్పన, లెంకాలపల్లి గ్రామానికి ఏఓ పరమేశ్వర్‌లను నియమించినట్లు తెల్సింది.