వరంగల్

పంద్రాగస్టుకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 14: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగరవేస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్పీకర్ మధుసూధనాచారి, మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి చందులాల్, జనగామలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రూరల్ జిల్లా జేఎన్‌ఎస్ గ్రౌండ్‌లో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరావు జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో బుధవారం జరగబోయో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాటు పూర్తి చేయడం జరిగిందని వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి అన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేస్తారని కలెక్టర్ చెప్పారు. అంతకు ముందు ఉదయం నుండి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్ధలలో, పాఠశాలలో జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో పాఠశాల విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలందించిన అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలతోపాటు, ప్రీడమ్ ఫైటర్‌కు సన్మానం చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలపై శకటాల ప్రదర్శన, పబ్లిక్ గార్డెన్స్‌లోని టౌన్‌హాల్‌లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుతుందని ఆమె తెలిపారు. అంతే కాకుండా సాయంత్రం 6గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా మధ్యాహ్నం 2.30 గంటలకు రెడ్ క్రాస్ భవనంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభిస్తారని కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.