వరంగల్

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ది ఒకే డీఎన్‌ఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగొండ, ఆగస్టు 14: కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ది ఒకే డీఎన్‌ఏ కల్గిన పార్టీలని, కుటుంబ పార్టీలను అని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని దుంపలపల్లిలో ఒళం కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను మురళీధర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం గుడేపల్లి లో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అదే విధంగా కొడవటంచలో ప్రధాన మంత్రి ఉజ్వల్ గ్యాస్‌లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుందని.. రైతులు బాగుంటేనే అందరం బాగుంటమని అన్నారు. రైతులకు అన్యాయం చేసిన వారు ఎవరు బాగుపడరని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశంతో పంట మద్దతు ధర పెంచారని చెప్పారు. కట్టల పోయిలేని దేశంగా భారత దేశా న్ని చేయ్యాలని ప్రధాని మోదీ ప్రధాన మంత్రి ఉజ్వల్ గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. స్వచ్ఛ్భారత్ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లు, ప్రధాన మంత్రి అవస్ యోజన్ పథకం కింద పక్క ఇండ్లు నిర్మించడం జరిగిందన్నారు. 2014 ఎన్నికల తర్వాత వరస విజయాలున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా కోల్పోయిందని తెలిపారు. కాంగ్రెస్ బలహీన మవుతున్న పార్టీ అని రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం కావడం అసాధ్యమని ఎద్దేవా చేశారు. రాబోయో మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అధికారం కోసం కాంగ్రెస్ దేశ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతోకలుస్తుందని అన్నా రు. ఈ కార్యక్రమంలో బీజీపీ కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెన్నంపెల్లి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.