వరంగల్

పూసల కులస్థులను సంచార జాతి జాబితాలో చేర్చేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 14: సమాజంలో వెనుకబడ్డ పూసల కులస్థులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారిని సంచార జాతి జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. నర్సంపేటలో మంగళవారం పూసల కులస్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పద్మశాలి గార్డెన్‌లో పూసల తల్లి ఆత్మగౌరవ సభ జరిగింది. ఈసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ పూసల కులస్థులకు షరతులు లేకుండా 50 వేల వ్యక్తిగత రుణాలను మంజూరు చేసేందు కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎం బీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్, ఆర్డీవో నెమురుగొమ్ముల రవి, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటిపల్లి వెంకట్, మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, వైస్ చైర్మన్ మునిగాల పద్మా వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ముత్తిరెడ్డికి గుణపాఠం తప్పదు: ఆహల్య
జనగామ టౌన్, ఆగస్టు 14: అధికారుల పట్ల దుర్సుగా ప్రవర్తించడంతో పాటు భూ ఆక్రమణలకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని ఐద్వా జిల్లా కార్యదర్శి ఆహల్య అన్నారు. ఐద్వా ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం కౌన్సిలర్ బొట్ల సుగుణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం అనంతరం ఆహల్య విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుసరిస్తున్న విధానంపై విమర్శలు చేశారు. తప్పులు చేసి క్షమాపణలు చెప్పడం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పరిపాటిగా మారిందని అన్నారు. పెంబర్తి వీఆర్‌వో పద్మను భూమికి సంబందించిన పాస్‌బుక్కు ఇవ్వాలని బెదిరించడం, గతంలో కలెక్టర్ శ్రీ దేవసేనలపై దుర్సుగా ప్రవర్తించి క్షమాపణలు చెప్పడం సిగ్గుచేటన్నారు. అధికారులను బెదిరించడం భూ కబ్జాలు చేయడం తప్పా ముత్తిరెడ్డికి ఏమీ తెలియదని విమర్శించారు. ఈ సమావేశంలో ఉమ, లలిత, వెంకట్‌లక్ష్మి, వౌనిక, విమల, భద్రమ్మ, రజిత, అన్నపూర్ణ పాల్గొన్నారు.