వరంగల్

హెరిటేజ్, కల్చర్, టూరిజం కేటగిరీల్లో 19న ఫొటోగ్రఫీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 17: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 19వ తేదీన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నదని జిల్లా పర్యాటక శాఖ అధికారి, సమాచార శాఖ ఉప సంచాలకులు డిఎస్ జగన్ తెలిపారు. పోటీలలో పాల్గొనే వారు హెరిటేజ్, కల్చర్, టూరిజం కేటగిరిల్లో వరంగల్ జిల్లా ప్రత్యేకతను చాటే చిత్రాలను పంపించాలని కోరారు. నిపుణులతో కూడిన జ్యూరీ ఉత్తమఫొటోగ్రఫీలను ఎంపిక చేసి, ఉత్తమ ఫొటోగ్రాపర్లను ప్రకటిస్తామని అన్నారు. మొదటి మూడు స్థానాలు పొందిన ఫొటో గ్రాపర్లకు సెప్టెంబర్ 27న జరిగే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో అవార్డులను ప్రధాన చేయడం జరుగుతుందని చెప్పారు. విజేతలకు ఫోన్, ఇమెయిల్, ద్వారా సమాచారం అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి వయస్సు, ప్రాంతంతో సంబంధం లేదని, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఫోటోలను మాత్రమే పంపించాలని కోరారు. పోటీల్లో పాల్గొనే వారికి ఎలాంటి రుసుం లేదు. పంపించే ఫోటోలు తాము తీసినవే అనే హామి పత్రాన్ని పంపించాలని కోరారు. ఫోటో తీసిన వారి పేరు, ఫోన్‌నెంబర్, చిరునామా, ఫోటో తీసిన ప్రదేశం తప్పకుండా పేర్కొనాలని అన్నారు. ఫోటోలను హన్మకొండలోని డీపీఆర్వో కార్యాలయంలో సెప్టెంబర్ 20లోగా పంపించాలని పేర్కొన్నారు.

20న బయ్యారంలో టీడీపీ బహిరంగసభ
* టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి
నర్సంపేట, ఆగస్టు 17: బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న బయ్యారంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు గడిచిపోయినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోవడం సరి కాదన్నారు. ఇదే సమయంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పకతే తామే నెలకొల్పుతామని చెప్ప డం ఎన్నికల జిమ్మిక్కు కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లు గుర్తుకు రాని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశం మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల వేళ ఉన్నపళంగా గుర్తుకు రావడం ప్రజలను మోసగించడమేనని ధ్వజమెత్తారు. బయ్యారంలో ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తే వేల మందికి ప్రత్యక్షంగా, మరికొంత మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆనాడే టీడీపీ పోరాటాలకు శ్రీ కారం చుట్టిందని అన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూ డెం జిల్లాల నుండి ప్రజలంతా భారీగా ఈసభకు తరలిరానున్నట్లు చెప్పారు. ఈసభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు హాజరు కానున్నట్లు వివరించారు. ఈసమావేశంలో టీడీపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పుల్లయ్య, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డీనేటర్ సంతోష్‌నాయక్, టీడీపీ మానుకోట ఇన్‌చార్జి సునీత, నాయకులు వెంకన్న, చాగంటి భీముడు, కిషన్‌నాయక్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.