వరంగల్

మతాలకతీతంగా పండుగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్‌క్రైం, సెప్టెంబర్ 18: మతాలు, కులాలతీతకంగా పండుగలు నిర్వహించుకోవడం వరంగల్ ప్రజల ప్రత్యేకత అని పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ అన్నారు. పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో మంగళవారం గణేష్ నిమజ్జన కమిటీలు, వివిధ సంఘాల మత పెద్దలతో ములుగురోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో గణేష్ నవరాత్రులు, 22 వ తేదీన నిర్వహించే నిమజ్జనం సందర్భంగా ఉత్సవ కమిటీ లు చేపట్టవలిసిన చర్యలు, వ్యవహరించాల్సిన తీరుపై పోలీ సు అధికారులు, కమిటీ సభ్యులతో సీపీ రవీందర్ చర్చించా రు. ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేపడుతున్న చర్యలను పోలీసు అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులకు వివరించా రు. ఈ సందర్భంగా వివిధ మతాలకు చెందిన పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడించడమే కాకుండా గణపతి నిమజ్జనం, రాబోయే మొహర్రం పండుగకు పోలీసులు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలకు తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు. అనంతరం పోలీసు కమిషనర్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం మన వరంగల్ మహానగరానికి మచ్చుతునక అని అన్నారు. ఇలాంటి మహానగరానికి పోలీసు కమీషనర్‌గా పనిచేయడానికి గర్వపడుతున్నానని, కొద్దిరోజుల క్రితం రంజాన్, బక్రీద్ పండుగలను ఆనందోత్సవాల నడుమ నిర్వహించుకున్నామని తెలిపారు. అదే తరహాలోనే గణేష్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని కోరారు. వరంగల్‌లో మతసామరస్యాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్లడం ద్వారా తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు వెంకట్‌రెడ్డి, సిద్దిఖీ, శ్రీనివాస్‌రెడ్డితోపాటు మత పెద్దలు భాస్కర్‌రావు, గంగు ఉపేంద్రశర్మ, ఖుస్రూపాషా, జైపాల్‌రెడ్డి, దర్శన్‌సింగ్, అబ్ధుల్ మజీద్, ప్రభాకర్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

ప్రజలను మభ్యపెట్టడంలో ఆ ఇద్దరూ దిట్ట
* ముందస్తుకు సిద్ధపడే రైతుబంధుకు శ్రీకారం
* గ్రామసభలలోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలి
* టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి
నర్సంపేట, సెప్టెంబర్ 18: ప్రజాధనాన్ని దొడ్డి దారిన పంచిపెట్టి ఓట్లు దండుకోవడానికి టీఆర్‌ఎస్ నాయకు లు పూనుకోవడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల వేళ పాడిగేదెలు, విద్యుత్ మోటార్లను సబ్సీడీలతో అందిస్తామని టీఆర్‌ఎస్ నాయకులు లీస్టులు తయా రు చేసి అధికారుల ద్వారా తమ పార్టీ కార్యకర్తలకు అందించేందుకు సిద్దపడటం ఎంత వరకు సమంజసమో ప్రజలంతా గమనించాలని కోరారు. నర్సంపేటలోని టీడీపీ కార్యాలయంలో మం గళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలను మోసం చేయ డం, మభ్యపెట్టడంలో కేసీఆర్, నియోజకవర్గ నేత పెద్దిలు ఇద్దరూ దిట్ట అని విమర్శించారు. రైతు బంధు పథకానికి తాము వ్యతిరేఖం కాదని, అయితే నాలుగు సంవత్సరాల పాటు రైతులు గుర్తుకు రాలేదని, ముందస్తు ఎన్నికలకు సిద్దపడే రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ఎన్నికల సమయంలో పంచి పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు సెంటిమెంట్‌తో నేడు అధికారంతో బాగుపడ్డ కుటుంబం కేసీఆర్ కుటుం బం మాత్రమేనని స్పష్టం చేశారు. సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చాక, తన కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు కేసీఆర్ పదవులిచ్చారని ఆరోపించారు. గ్రామ సభలు నిర్వహించకుం డా లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఊరుకునేది లేదని, కలెక్టర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. దీనిపై జో క్యం చేసుకోవాలని గవర్నర్‌కు లిఖిత పూర్వకంగా పార్టీ తరుపున లేఖ అందిస్తామని వెల్లడించారు. కార్పోరేషన్ల ద్వారా మంజూరు అయ్యే పథకాల లబ్ధిదారులను గ్రామసభలలో ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అధికారులు స్పందించకుంటే 21న నర్సంపేటలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈవిలేఖరుల సమావేశంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎర్ర యాకూబ్‌రెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కో ఆర్డీనేటర్ జాటోతు సంతోష్‌నాయక్, నాయకులు వేముల బొందయ్యగౌడ్, చిలువేరు కొమ్మాలు, కొయ్యడి సంపత్, బంక రవీందర్, జనగం స్వామి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.