వరంగల్

హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, సెప్టెంబర్ 18: ప్రేమ వివాహం చేసుకొన్నందుకు ప్రణయ్‌ని హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ప్రణయ్‌ని హత్యను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌తో పాటు ఎంఎస్‌ఎఫ్, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జనగామలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంత రం చౌరస్తాలో రాస్తారోకో నిర్వహిం చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంద కృష్ణమాదిగ ప్రజాసంఘాల నాయకులతో కలిసి ప్రదర్శనలో పాల్గొని చౌరస్తా వరకు పాదయాత్ర చేశారు. అనంతరం మంద కృష్ణమాదిగ మీడియాతో మాట్లాడుతూ ప్రణయ్ హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల అండతోనే ఈ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. హత్య కేసులో ఉన్న నిందితులకు శిక్ష పడేంతవరకు జైలులోనే బందించాలని ఆయన డిమాండ్ చేశా రు. ప్రేమ పేరుతో దళితులపై ఎక్కడ హత్యలు జరిగినా ప్రభుత్వం నిందితులకు అండగా నిలస్తూ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందే తప్పా అమలులో వివక్షత వహిస్తుందని ఆరోపించారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ప్రభుత్వమే అన్ని విధాల రక్షణ కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డాక్టర్లు రాజవౌళి, సుగుణాకర్, సీపీఎం నాయకులు బొట్ల శ్రీనివాస్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లేషం, జిల్లా ఇన్‌చార్జి పుట్ట రవి, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకుడు గిరిమల్ల రాజు, వృత్తిదారుల సంఘం జిల్లా నాయకుడు బూడిద గోపి, ఎంఎస్‌ఎఫ్ జిల్లా ఇన్‌చార్జి రాగళ్ల ఉపేందర్‌తో పాటు మరికొందరు నాయకులు పాల్గొన్నారు.

జెన్‌కో భూనిర్వాసితుల ఆందోళన
మల్హర్, సెప్టెంబర్ 18: మల్హర్ మండ లం తాడిచెర్లలో జెన్‌కో భూనిర్వాసితులు మంగళవారం ఏఎమ్మార్ కంపెనీ పనులను అడ్డుకుంటూ, ఆందోళన చేశారు. ఏఎమ్మార్ కంపెనీ చేపడుతున్న ఒపెన్‌కాస్టు పనుల వల్ల బాంబు బ్లాస్టింగ్‌లతో దుమ్ము, దూళి వల్ల పంటలు, ఇండ్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, కొన్ని ఇండ్లు పగుళ్ళు తేలి, భయానికి గురి చేస్తున్నాయని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎమ్మార్ కంపెనీలో పనులు చేపడుతున్న పలు వాహానాలను మహిళలు, వృద్దులు అధిక సంఖ్యలో చేరుకొని అడ్డుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏఎమ్మార్ కంపెనీ వారు కుమ్మక్కై భూనిర్వాసితులకు అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాడిచెర్ల ప్రాంతంలో ఓపెన్‌కాస్టు నిర్మిస్తే ఈ ప్రాంత మా నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆశతో మాకు అన్నం పెట్టె భూములను ధారాధత్తం చేస్తే, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వేరే ఊర్లకు చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, మాకు తీరని అన్యాయం చేశారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఏఎమ్మార్ కంపెనీ స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించి, డేంజర్ జోన్ నుంచి విముక్తి కల్పించాలని వారు కోరారు. ఈ సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారీ, కాటారం సీఐ కాగితోజు శివప్రసాద్, ఎస్‌ఐ ఇస్లావత్ నరేష్‌నాయక్‌లు నిర్వాసితులతో మాట్లాడి ఆందోళనను విరమింపచేశారు.