వరంగల్

మాయల మరాఠీ మాటలు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్మెట, సెప్టెంబర్ 19: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను తుంగలోతొక్కి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన మాయల మాటల మరాఠీ కేసీఆర్ భూటకపు మాటలను ప్రజలు నమ్మంద్దని మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పార్టీ జెండా పండు గ సందర్భంగా మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఉద యం బొమ్మకూర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం భారీ ద్విచక్రవాహన ర్యాలీతో సాగి సాయంత్రం కనె్నబోయినగూడెంలో ముగిసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలు, తండాలు అభివృద్ధికి నోచుకున్నాయని, సోనియమ్మ చలవతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిచిందన్నారు. తాగు, సాగు నీటికి పలు సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గాయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని, కేసీఆర్ చేసిందేమీలేదని, కనీసం రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయి లో నింపిన పాపాన పోలేదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కాంగ్రెస్ 9 రకాల నిత్యవసర సరుకులను పేదలకు అందించగా కేసీఆర్ వారి పొట్టకొడుతూ కేవలం బియ్యం మాత్రం ఇస్తున్నాడని అన్నారు. వైఎస్సార్ హయాంలో మండలంలో వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరగగా టీఆర్‌ఎస్ పాలనలో ఒక్క డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కూడా పూర్తి స్థాయి నిర్మాణానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని, ఎన్నికల మానిఫెస్టోలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయని ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజార్టీతో గెలవడం కాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొంపెల్లి రమేష్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జంగిటి అంజయ్య, ఎంపీటీసీ ఫరీదుల యాదయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ గొల్లపల్లి కుమారస్వామి, సీనియర్ నాయకులు రంగరాజు ప్రవీణ్‌కుమార్, ప్రజ్ఞాపురం అంజయ్య, బైరగోని రాజ్‌కుమార్, పండ్ల బాలనర్సు, బోగా అంజయ్య, ప్రభాకర్, సరాబు మధు, ఏసర్ల అంజయ్య, బుర్ర రాజుగౌడ్, యాట బిక్షపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు యాట క్రాంతికుమార్, బొక్క సంజయ్‌కుమార్, రెండు వందలకు పైగా ద్విచక్రవాహనాలతో ర్యాలీలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి
ఏర్పాట్లను పరిశీలించిన అధికార యంత్రాంగం
పరకాల, సెప్టెంబర్ 19: వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించేందుకు పరకాల అధికార యంత్రాంగం రంగంలోకి దింగింది. పరకాల ఏసీపీ సుధీంద్ర, కమిషనర్ జోనా, తహశీల్దార్ హరికృష్ణ, సిఐ మధు, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, ఉత్సమ సమితి కన్వీనర్ డాక్టర్ నాగబండి విద్యాసాగర్‌ల ఆధ్వర్యంలో బుధవా రం పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిమజ్జనం జరిగే వాగును వారు సందర్శించారు. రద్దీ తీవ్రతను అరికట్టే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. నిమజ్జ న సమయంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ, వరుస క్రమంలో విగ్రహాలు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవడం వంటి అంశాలతో పాటు నిమజ్జనానికి వచ్చిన విగ్రహాలను జాగ్రత్తగా నిమజ్జనం చేయడం, ఏలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయ డం వంటి అంశాలపై పరిశీలన చేశా రు. ఈ సందర్భంగా పరకాల ఏసీపీ సుధీంద్ర మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పరకాలలో ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో వినాయక చవతి వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండప నిర్వాహకులపైనే ఉంటుందని అన్నారు. నిబంధనలు అనుసరించి నడుచుకోవాలని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా అధికార యం త్రాంగం పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ సంపూర్ణ సహకారాన్ని అందచేయాలని కోరారు. ప్రభు త్వ యంత్రాంగం ప్రజల భద్రత కోస మే పని చేస్తుందన్న అంశాన్ని గుర్తించుకోవాలని సూచించారు. కార్యక్రమం లో ఏఈ రవీంద్రనాధ్, విద్యుత్ ఏఈ రవికుమార్, ఉత్సవ సమితి సభ్యులు ఆర్‌పి జయంతిలాల్ తదితరులు పాల్గొన్నారు.