వరంగల్

కమ్యూనిస్టులను ఏకం చేయడమే ఎంసీపీఐ(యూ) లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 24: దేశంలో ఉన్న కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలను ఏకం చేయడమే ఎంసీపీఐ(యూ) లక్ష్యమని ఆపార్టీ రూరల్ జిల్లా కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఎంసీపీఐ(యూ), ఆర్‌ఎంపీఐ ఐక్యత సందర్భంగా అక్టోబర్ 3న హైద్రాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం పట్టణంలోని ఓంకార్ భవన్‌లో నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో బలమైన యూనిట్లు కలిగిన రివల్యూషనరీ మార్కిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎంపీఐ) ఎంసీపీఐ(యూ)లో ఐక్యం కావటానికి ముందుకు రావటం హర్షించదగ్గ విషయమని చెప్పారు. నర్సంపేట గడ్డపై 1984వ సంవత్సరంలో ఆవిర్భవించిన ఎంసీపీఐ(యూ) దిన దినమానం వర్ధిల్లుతూ దేశ వ్యాప్తంగా విస్తరించిందని చెప్పారు. పార్లమెంట్, పార్లమెంటేతర కార్యక్రమాలు, వర్గ పోరాటాలకు పునాదిగా ఉంటాయని, కేవలం పార్లమెంటరీ భ్రమలలో కూరుకపోయి ఒకటి, రెండు సీట్ల కోసం పాలకవర్గ భూస్వామ్య పార్టీలకు తోక పార్టీలుగా మారటాన్ని వ్యతిరేఖిస్తుందని చెప్పారు. బీజే పీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలన్ని దోపీడీ వర్గ పార్టీలేనని, వాటికి ప్రత్యామ్నయంగా ఏర్పడ్డ బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ప్రజలంతా వచ్చే ఎన్నికలలో ఆదరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు కన్నం వెంకన్న, నాగెల్లి కొమురయ్య, పిట్టల లక్ష్మీనారాయణ, చెక్క వెంకటయ్య, రాజవౌళి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ
ఓటు నమోదు చేసుకోవాలి
* జనగామలో అవగాహన ర్యాలీ.. పాల్గొన్న కలెక్టర్
జనగామ టౌన్, సెప్టెంబర్ 24: అర్హులైన వారందరూ ఓటు హక్కు పొందాలని జనగామ కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి కోరారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ శాఖల పలువురు ఉద్యోగులు, బీఎల్‌వో లు, మహిళా సంఘాల ప్రతినిథులు, విద్యార్థులతో జనగామలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి, జేసీ మధులు ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీదుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ 18సంవత్సరాలు పూరె్తైన ప్రతి యువతియువకుడు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం లేదని, అందుకే అర్హులైన వారందరూ ఈ హక్కును సద్వనియోగం చేసుకోవాలని అన్నారు. అనంరతం తెలంగాణ సంస్కృత సార ధి కళాకారులు ఆలపించిన గేయాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నా యి. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో మధు, చేనేత జౌళి శాఖ సహాయ సం చాలకుడు సాగర్, డీపీఆర్‌వో ప్రేమలత, సీఐ శ్రీనివాస్, తహశీల్దార్ రమేష్‌లతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.