వరంగల్

యుద్ధం మొదలైంది.. గెలుపు బీజేపీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 23: 70 ఏళ్లుగా పరిపాలించిన రాజకీయ పార్టీలు ప్రజలను పట్టించుకోకపోవడంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కలిగించిందని, ఆ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ ప్రజల ఆశీర్వాదలతో అధికారంలోకి వస్తుందని భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. మొగుళ్ళపల్లి మండలం రంగాపూరంలో ఇంటింటి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న 112 పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చేరకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటుందని అందులో భాగంగానే స్వచ్ఛ్భారత్ పథకంలో భాగంగా రూ.12 వేల రూపాయలతో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రత్యర్ధులు ఇంతకు ముందు గెలిచి ప్రజలకు ఏం చేశారో తెలపాలని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో పాటు తెరాస ప్రభుత్వాలు ప్రజల అకాంక్ష మేరకు పనిచేయక పోయినందునే బీజేపీ రాబోయో ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ప్రజలకు చెంతకు వచ్చిందని ఆమె పేర్కోన్నారు. నియోజకవర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల సహకారంతో ప్రజల అకాంక్ష మేరకు అభివృద్ధి పరిచేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెన్నంపల్లి పాపయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రాంచంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోరె రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

దళారీ వ్యవస్థను రూపుమాపాలి: జేసీ డేవిడ్
మహబూబాబాద్, అక్టోబర్ 23: దళారీవ్యవస్థను రూపుమాపేందుకు ముదిరాజ్ మత్స్య కార్మికులతో పాటు అన్ని సామాజిక వర్గాల మత్స్య కార్మికులు చైతన్యం కావాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ యం.డేవిడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మత్స్య కార్మికుల ఆర్ధిక అభివృద్ధికి అన్ని వనరులను ఉపయోగించుకొని ముందుకు సాగాలని జేసీ సూచించారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం లో మంగళవారం జరిగిన మత్స్యకార్మికుల శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ఏ.సరళకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్య కార్మికుల తలసరి ఆదాయం, అక్షరాస్యత శాతం పెంచేందు కు జిల్లా యంత్రాంగం పాటుపడుతుందని, దానికి ప్రతి కార్మికుడు తనదైన శైలిలో పనిచేసి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తనవంతు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని 141 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 1076 చెరువులు ఉన్నాయని ఈ సంవత్సరం భారతప్రభుత్వం 4 కోట్ల 36 లక్షల చేపపిల్లలను మంజూరి చేసిందని వచ్చే సంవత్సరం ఈ చేప పిల్లల్ని జిల్లాలోనే ఉత్పత్తి చేసేవిధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చేప పిల్లలను వచ్చే ఆర్ధిక సంవత్సరం మత్స్య కార్మికులే తయారు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి టి.ఆంజనేయస్వామి, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సహదేవ్, శాస్తవ్రేత్త అజయ్ ఆదర్శరావు, బాలాజి, ప్రభాకర్ పాల్గొన్నారు.