వరంగల్

రూ.40వేల కోట్లతో కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్మెట, అక్టోబర్ 23: గత నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాలనుకున్న సంక్షేమ పథకాలను ఒంటిచేత్తో అమలుచేయడమే కాకుండా.. తాగు, సాగు నీటికి పెద్దపీట వేస్తూ రూ. 40వేల కోట్ల తో అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాడని మాజీ ఎమ్మెల్యే, జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను చేసిన అభివృద్ధిని చూసి ఆదరించి పట్టం కట్టాలని ఆయన అన్నారు. మండలంలో నూతనంగా ఏర్పాటైన ఆగపేట, మాన్‌సింగ్‌తండా గ్రామపంచాయతీల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం చేసిన ఆయన కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించి బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఓటర్లను కోరారు. అమలులో ఉన్న పెన్షన్‌లను రెట్టింపు చేయడం, ఎకరాకు రూ. 8వేలుగా ఉన్న రైతుబంధు పథకంను రూ. 10వేలకు పెంచ డం, రూ. 1లక్ష రైతు రుణమాఫీ లాంటీ పలు పథకాలను టీఆర్‌ఎస్ పాక్షిక మానిఫెస్టోలో ప్రకటించడం శుభపరిణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగారావు, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ పెద్ది రాజిరెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు ఎండీ గౌస్, రైతు సమన్వయ సమితి మండల కో- ఆర్డినేటర్ చింతకింది సురేష్, కోశాధికారి ఇట్టబోయిన రమేష్, ఎంపీటీసీ బుడ్డా స్నేహలతాభాస్కర్, మండల యూత్ అధ్యక్షులు ఆమెడపు కమళాకర్‌రెడ్డి, పార్నంది సతీష్‌శర్మ, గడపురం శశిరథ్, నక్కల రవి, మాజీ ఎంపీపీ కోనేటి భవాని, మల్లేష్, ప్రచార కార్యదర్శి నీరటి సుధాకర్, కంతి రాజలింగంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మలతో ముత్తిరెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ ఆంధ్ర పాలనే : స్పీకర్
టేకుమట్ల, అక్టోబర్ 23: తెలంగాణ ప్రజలు బాగుండటమే మా జెండా ఎజెండా అని స్పీకర్ తెరాస అభ్యర్ధి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం మండలంలోని ఎంపెడు, వెల్లంపల్లి, కుందనపల్లి, బండపల్లి, గుమ్మడివెల్లి, దుబ్యాల, అరెపల్లి, రాఘవరెడ్డిపేట గ్రామాలల్లో ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ ఆంధ్ర పాలన వస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సింహావలోకనం చేసుకుంటున్నారని చెప్పారు. మహాకూటమి పేరుతో మాయగాళ్లు వస్తున్నారని వాళ్లకు ఓట్లు అడిగే అర్హత లేదని మండిపడ్డారు. స్వతంత్య్ర పోరుతో వస్తున్న నాయకులకు విమర్శించడమే తప్పా అభివృద్ధి కనబడటం లేదని పేర్కోన్నారు. ఈ ప్రచారంలో సాంబారి సమ్మరావు, నవనీతరావు, సంపత్, కొమురయ్య, కొలిపాక రాజయ్య, తిరుపతి, రవీందర్, సదాకర్, కుమాస్వామి, కోటి తదితరులు పాల్గొన్నారు.

పరకాల సీటు ఇనగాలకే..
* నియోజకవర్గాలలో పోటీ చేసిన వారికే సీటు కేటాయిస్తాం: ఆర్‌సీ కుంతియా
పరకాల, అక్టోబర్ 23: గత ఎన్నికల్లో నియోజకవర్గాలలో ఎవరైతే పోటీ చేశారో ఈసారి కూడా వారికే తప్పకుండా సీటు కేటాయిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్‌సి కుంతియా అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ వార్ రూమ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన పొత్తుల అంశాలతో పాటు సీట్ల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్‌సి కుంతియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికలలో నియోజకవర్గాల వారిగా కాం గ్రెస్ పార్టీ టికెట్‌పై ఎవరైతే పోటీ చేశారో ఈ సారి కూడా తప్పకుండా వారికే సీటు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు పలు పత్రికలలో, టివీలలో వచ్చిన వార్తలు ఊహాజనితమైనవిగా ఆయన పేర్కొన్నారు. పరకాల టికెట్ ఇనగాల వెంకట్రాంరెడ్డికేనని, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్‌లకేనని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి సమక్షంలో ఆయన వెల్లడించారు.