వరంగల్

పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, నవంబర్15: డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో దివ్యాంగుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రధన ఎన్నికల అథికారి రజత్‌మార్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, , జేసీ కూరాకుల స్వర్ణలతలను ఆదేశించారు. గురువారం సాయంత్రం రజత్‌కుమార్ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు వీల్ చైర్లతో పాటు అందుల కోసం బ్రెయిల్ లిపి తో ఉన్న ఓటింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలతో పాటు క్యూ లైన్ల వద్ద కూడ వారి కోసం వారికి సహకాయకులను నియమించి ప్రశాంతంగా దివ్యాంగులు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్ ఆదేశించారు.
తూర్పు అభ్యర్థిగా నరేందర్
టీఆర్‌ఎస్ శ్రేణుల హర్షం
వరంగల్, నవంబర్ 15: వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా మేయర్ నన్నపనేని నరేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ కార్పోరేటర్లు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో మేయర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పడంతోపాటు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తూర్పు అభ్యర్థిగా ప్రకటించడంపై సీఏం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తన అభ్యర్థిత్వానికి సహకరించిన స్థానిక నాయకులకు ఎల్లవేలల రుణపడి ఉంటానని, తెలంగాణాలో రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఒక సామాన్యుడినైన తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ఆశీర్వాదంతో ముందుకు వెళుతానని తెలిపారు. తూర్పు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో లక్ష ఓట్లు సాధించి కేసీ ఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసారు. అంతేకాకుండా మేయర్‌గా నగరాభివృద్దికి ఎంతగా కృషి చేసానో, తూర్పు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తానని అన్నారు. ఎంతో కష్టపడి చిన్నస్థాయినుండి ఎదిగిన తనను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి, కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.