వరంగల్

సంక్షేమ పథకాలు సాగాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగొండ, నవంబర్ 15: తెలంగాణ సంక్షేమ పథకాలు కొనసాలంటే తెరాసను గెలిపించాలని భూపాలపల్లి తెరాస అభ్యర్ధి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అన్నారు. గురువారం మండలంలోని రామగుండం, జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, వెంకటేశ్వరపల్లి, కొనారావుపేట, గాంధీనగర్, నిజాంపల్లి. గొరికొత్తపల్లి గ్రామాల్లో సిరికొండ మధుసూధనాచారి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేసిందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం అగి పొవద్దంటే తిరిగి తెరాసనే గెలిపించాలని అన్నా. నాలుగున్నార సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ప్రజలు కళ్ల ముందు కనబడుతుందన్నారు. గత పాలకులు చేసిన అభివృద్ధిని బేరుజు వేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలు చూడాలని గత 70 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో చూసి తెరాసకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాంబరి సమ్మరావు, మండల అధ్యక్షుడు ఉమేష్‌గౌడ్, మైస బిక్షపతి పాల్గొన్నారు
తూర్పు అభ్యర్థిగా నరేందర్
టీఆర్‌ఎస్ శ్రేణుల హర్షం
వరంగల్, నవంబర్ 15: వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా మేయర్ నన్నపనేని నరేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ కార్పోరేటర్లు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో మేయర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పడంతోపాటు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తూర్పు అభ్యర్థిగా ప్రకటించడంపై సీఏం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తన అభ్యర్థిత్వానికి సహకరించిన స్థానిక నాయకులకు ఎల్లవేలల రుణపడి ఉంటానని, తెలంగాణాలో రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఒక సామాన్యుడినైన తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ఆశీర్వాదంతో ముందుకు వెళుతానని తెలిపారు. తూర్పు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో లక్ష ఓట్లు సాధించి కేసీ ఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసారు. అంతేకాకుండా మేయర్‌గా నగరాభివృద్దికి ఎంతగా కృషి చేసానో, తూర్పు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తానని అన్నారు. ఎంతో కష్టపడి చిన్నస్థాయినుండి ఎదిగిన తనను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి, కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.