వరంగల్

కేసీఆర్‌కు చరమగీతం పాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 16: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, అమరవీరుల ఆశయాలకు విరుద్దంగా నిరంకుశ పాలన కొనసాగించిన కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిందిగా కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్ యువ నాయకులు వేముల సాంబయ్య, దండెం రతన్‌కుమార్‌లతో పాటు ఐదు వందల మంది టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి దొంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలుత పట్టణంలోని పాఖాల జయలక్ష్మీ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో వేముల సాంబయ్య, దండెం రతన్‌కుమార్‌లతో పాటు పలువురికి దొంతి మాధవరెడ్డి కండువాలు కప్పి కాం గ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా కేసీ ఆర్ నిరంకుశ పాలన కొనసాగించారని, ధర్నాలు, నిరసనలు చేసుకునే హక్కును సైతం కాలరాసారని మండిపడ్డారు. ఉద్యమకారులను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వార గల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చే ఉగాది నుండి ఇందిరమ్మ పాలన అందిస్తామని స్పష్టం చేశారు. పేదలు ఇళ్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం, మహిళా సంఘాలకు లక్ష రూపాయల మ్యాచింగ్ గ్రాంటుతో పాటు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం, ప్రతి ఒకరికి ఏడు కిలోల సన్న బియ్యం, ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెలకు రెండువేల రూపాయల ఆసరా ఫించన్లు, నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిని అందిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చుసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పట్టణ అధ్యక్షుడు పెండెం రామానంద్, సందీప్, చరణ్, భరత్ పాల్గొన్నారు.
* టీఆర్‌ఎస్ నేత దండెం రతన్‌కుమార్ అర్ధనగ్న ప్రదర్శన
తెలంగాణ ఉద్యమకారులను అవమానించారని నిరసిస్తూ శుక్రవారం నర్సంపేటలో టీఆర్‌ఎస్ నాయకుడు దండెం రతన్‌కుమార్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని పాఖాల జయలక్ష్మీ సెంటర్ నుండి టీఆర్‌ఎస్ యువనాయకులు వేముల సాంబయ్య, దండెం రతన్‌కుమార్‌ల ఆద్వర్యంలో ఐదు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలో ర్యాలీ తలపెట్టారు. అయితే దండెం రతన్‌కుమార్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి టీఆర్‌ఎస్ అనుబంధ టీఆర్‌ఎస్వీలో క్రియాశీలకంగా పనిచేసి పెద్ది సుదర్శన్‌రెడ్డి అనుచరుడిగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక తమ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎలాంటి భరోసా కల్పించలేదని దండెం రతన్‌కుమార్ నిరసిస్తూ షర్టు విప్పి చేసిన అర్ధనగ్న ప్రదర్శనపై అందరి దృష్టి పడింది. ఇదీ తెలంగాణ ఉద్యమకారుల స్థితి అని పేర్కొంటూ ప్లేకార్డును రతన్ ప్రదర్శించారు.