వరంగల్

ఆదరించి అసెంబ్లీకి పంపండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 17: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తన ఆస్తులు సైతం అమ్ముకుని వచ్చానని బిఎస్‌పి అభ్యర్థి రాజారపు ప్రతాప్ అన్నారు. శాసనసభ అభ్యర్ధిగా శనివారం నామినేషన్ వేసిన ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గత రెండు దశాబ్దాలుగా వారికి సేవ చేయడానికి అన్ని వదులుకుని ప్రజల పక్షానికి వచ్చానన్నారు. సేవే పరమావధిగా పనిచేస్తున్న తనను ఆదరించి అసెంబ్లీకి పంపిస్తే అవినీతి పరుల అంతుచూస్తానని ఆయన ఆక్రోశంతో అన్నారు. ప్రజా సేవ చేయాల్సిన గత పాలకులు కేవలం తమ వ్యక్తిగత వనరులను కూడగట్టుకోవడానికే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే అలాంటి అవినీతి ఛీడ పురుగులను ఏరిపారేయడమే లక్ష్యంగా తీసుకుంటానని ఆయన అన్నారు. కాంగ్రెసు, టిఆర్‌ఎస్ పార్టీలు తనను రెండు పర్యాయాలు మోసం చేశాయని, ఆయా పార్టీలు కేవలం అవినీతి పరులకే అండగా ఉంటాయని, తనలాంటి నీతిమంతులకు అవకాశం కల్పించలేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు మంజూరీ చేస్తున్న నిధులను 50శాతం ఖర్చుపెట్టి, మరో 50 శాతం తమ ఖజానాలో నింపుకోవాలని, నింపుకున్న సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేయాలని ఆయా పార్టీల అధిష్టానాలే సూచించడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు కనీసవేతనాలు అందించలేని ప్రభు త్వం,ఎమ్మెల్యే, మంత్రులకు లక్షలాది జీతాలు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. అలాంటి వ్యవస్థను రూపుమాపడమే బిఎస్‌పి లక్ష్యమన్నారు. అందుకే బహుజనులకు అధికారం రావాలని ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నాయకులు కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, ధర్మసాగర్ మాజీ ఎంపిపి యాదగిరి, ఘన్‌పూర్ ఎంపిటిసి డాక్టరు జైహిందురాజు, డాక్టరు హేమంత్‌రాజు, చెవుల యాదగిరి, మాజీ సర్పంచ్‌లు మధు, తోట రాజయ్య, జానీపాషా, రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.