వరంగల్

పశ్చిమలో బిగ్ ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 17: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుండెకాయలా ఉన్న వరంగల్ పశ్చిమలో త్రిముఖ పోటి నెలకొంది. టీ ఆర్ ఎస్ నుండి హ్యట్రిక్ సాధించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటికే గత నెల రోజులుగా మొదటి విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేసి నియోజకవర్గాన్ని చుట్టముట్టారు. ఇక మహాకూటమి అభ్యర్ధిగా టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరు హైడ్రామాల మధ్య రెండు రోజుల కిందటే ఖరారు అయ్యింది. ఇక్కడి నుండి మహాకూటమి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయిని రాజేందర్‌రెడ్డి టికెట్ విషయంలో చివిరి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. పోత్తులో భాగంగా వరంగల్ పశ్చిమ స్ధానాన్ని టీడీపీకి కేటాయించగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి దక్కించుకున్నాడు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్ధానికేతరుడు అంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్న దానిని అదిగమిస్తూ నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో నర్సంపేట టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మంచి పేరు ఉంది.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం తనకు కలిసోస్తుందని ధీమాలో ఉన్నారు ఆయన. అయితే కాంగ్రెస్ అభ్యర్ధి రాజేందర్‌రెడ్డి రెబల్‌గా ఉండడం ఇబ్బందిగా మారిన నేడో, రేపో రెబల్ అభ్యర్ధి పోటీ నుండి ఉపసంహరించుకుంటాడని ప్రచారం జరుగుతుంది. ఇక బీజేపీ అభ్యర్ధి మార్తినేని ధర్మారావుకు కూడా రెబల్ బెడద ఉన్నప్పటికి నేడో,రేపో రెబల్ అభ్యర్ధిగా వేసిన ఆపార్టీ అర్బన్ అధ్యక్షురాలు పోటీ నుండి తప్పకునే విధంగా అధిష్టానం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని నరేంద్రమోదీ ఆవా తనుకు కలిస్తోందనిధర్మారావుధీమాగా ఉన్నా రు. పశ్చిమలో ఎంతమంది పోటీలో ఉన్నప్పటకిత్రిముఖ పోటీ అనివార్యం కానుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్. టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఓటర్ దేవుళ్లు మాత్రం ఎవ్వరి వైపు ఉంటారో చూడాల్సిందే.