వరంగల్

గడీల పాలనకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, నవంబర్ 18: దొరల గడీల పాలనకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు మహాకూటమిగా ఏర్పడ్డాయని.. అందులో బాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడటం వల్ల తన సీటు విషయంతో పాటు అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అయిందని దానిని రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరా లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు సేవ చేశానని అందుకే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలతో తనకు అవినాభావ సంబందం ఉందని అన్నారు. మెరుగైన పాలన అందించిం ది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలను నమ్మించి మోసం చేయడం కేసిఆర్‌కు అలవాటైందని అన్నారు. జీవిత కాలం ప్రజలను నమ్మించలేరని వారు మేల్కొన్నారని అన్నారు. తన సీటు విషయం లో టిజెఎస్ వారు సహకరించాలని అన్నారు. ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని దానికి మహాకూటమిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్దిని గ్రామగ్రామాన చెప్పుకుంటున్నామని వారు చేసిన అభివృద్ది ఏమిటో ప్రజలకు చెప్పుకునే దైర్యం టీఆర్‌ఎస్ పార్టీ వారికి లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు కొమ్ము రవి, ముస్త్యాల కిష్టయ్య, వకుళాభరణం నర్సయ్యపంతులు, మద్దురు జెడ్పీటిసి పద్మ నాయకులు గిరికొండల్‌రెడ్డి, ముస్త్యాల యాదగిరి, కాటం శ్రీనివాస్, బాలరాజు, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.