వరంగల్

ప్రజాకూటమిదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 18: తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జాతీయ కోఆర్డీనేటర్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి అన్నారు. నర్సంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కత్తి వెంకటస్వామి మాట్లాడారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో కొంత మంది అగ్రవర్ణాల నాయకులు బీసీలు గెలిచే స్థానాలను ఓసీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేశారని వాపోయారు. తామంతా పార్టీ అధినేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లామని, ఈక్రమంలోనే దాదాపు 34 మందికి బీసీ కోటా కింద టిక్కెట్లు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని ఓబీసీ నాయకులలో అసంతృప్తి ఉన్నా పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డికి సీటును పార్టీ అధినేత రాహుల్‌గాంధీ కేటాయించారని, రాహుల్‌గాంధీ నిర్ణయం శిరోధార్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించి, టీఆర్‌ఎస్‌ను బొందపెట్టడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర కూటమి భాగస్వామ్య పక్షాలు పనిచేస్తున్నాయని, మహాకూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నర్సంపేటలో కాం గ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విలేఖరుల సమావేశంలో సమ్మునాయక్, పంజాల రాము, లింగారెడ్డి, మల్లారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎక్కడలేని నియామవాళి పాలకుర్తిలోనే ఎందుకు ?
*ఎన్నికల వేల సామాన్యులకు ఇక్కట్లు
పాలకుర్తి, నవంబర్ 18: ఎన్నికల నియామవళిలో నిబంధనలు లేకుండా పాలకుర్తి తహాసీల్ధార్ కార్యాలయం వద్ధ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా అధికారులు అంక్షాలు విధిస్తూ సామాన్య ప్రజలకు వారం రోజులుగా చుక్కలు చూపిస్తున్నారు. ఈనెల 12న రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పడి నుండి పాలకుర్తి తహాసీల్ధార్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3.30గంటల వరకు గేట్లకు తాళాలు వేస్తుండటంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, రైతులు, వృద్ధు లు నరకయాతన పడుతున్నారు. నామినేషన్ వేసే తహాసీల్ధార్ ఆఫీస్ వద్ధ ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ కార్యాలయాలు పక్కపక్కనే ఉన్నాయి. ప్రస్తుతం వివిధ పరీక్షలకు ఫీజుల మాఫీ కోసం కులం, ఆదాయం సర్టీఫికేట్లు, రైతలు పహానీలు, పాస్‌పుస్తకాల కోసం వందల సంఖ్యంలో వారం రోజులుగా చెప్పులు అరిగేల తిరుగుతున్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయని లోపలికి అనుమతించటం లేదు. ఈ విషయంపై పాలకుర్తి ఎన్నికల అధికారిణి ఎం.మాలతిని ఫోన్లో వివరణ అడుగగా స్పష్టమైన సమాధానం చెప్పకుండ దాటవేశారు.