వరంగల్

గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 18: ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేలాదికోట్లు కేటాయించి ఆదుకుందని అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందు కు మైనార్టీలంతా కృషి చేయాలని ఆపధర్మ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కోరారు. జనగామ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో స్థానిక గాయత్రి గార్డెన్‌లో ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి నాలుగేండ్లలో అమలుచేసిన పథకాలను వివరించారు. గత పాలకులు ముస్లింలను ఓటుబ్యాంకుగానే ఉపయోగించుకున్నారు తప్పా రాజకీయం గా, ఆర్థికంగా ఆదుకోలేదని అన్నారు. కేవలం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం నాలుగేండ్లలో రూ. 2వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఉర్ద్భుషను రెండవ భాషగా గుర్తించడంతో పాటు ప్రత్యేక ఉర్దు పాఠశాలలు ఏర్పాటుచేసి విద్యార్థుల ఉన్నతికోసం కృషి చేస్తున్నాడని అన్నారు. అనంతరం అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల శ్రేయస్సు కోసం అమలు చేసిన సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలియచేశారు. ఈ సభలో ఖాదీ చైర్మన్ వౌలానా జహంగిర్ అలీ, మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి, నాయకురాలు ముత్తిరెడ్డి పద్మలతారెడ్డి, మార్కె ట్ చైర్‌పర్సన్ పద్మయాదగిరిరెడ్డి, నియోజకవర్గ కన్వినర్ సంపత్‌రెడ్డి, కొమురవెళ్ళి దేవస్థాన చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు ముస్లిం మైనార్టీ మహిళా విభాగం నాయకురాలు పాల్గొన్నారు.