వరంగల్

ఫాం హౌస్, ప్రగతి భవన్‌కే పరిమితమైన కేసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 19: నాలుగు సంవత్సరాల పాటు ప్రగతిభవన్, ఫాం హౌస్, పబ్లిక్ మీటింగ్‌లకే పరిమితమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య కోరారు. సోమవారం జనగామ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మధుమోహన్‌కు ఆయన తమ నామినేషన్ పత్రాలను అందచేశారు. మహాకూటమికి చెందిన టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులతో ఆర్డీవో కార్యాలయం వరకు వచ్చి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్ధం చేసుకున్న ఆనాటి యూపీఏ చైర్మన్ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదిస్తే అవకాశ వాధంతో అధికారంలోకి వచ్చిన కేసిఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. మిగులు బడ్జెట్‌తో వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చి ప్రజలపై భారాన్ని మోపాడని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి మరోసారి అధికారంలోకి రావడానికి మాయమాటలతో ప్రజల ముందుకు వస్తున్నాడని అన్నారు. ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దమవుతున్నారని అన్నారు. ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులు మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఖాయన్నారు. మహాకూటమి సభ్యుల సమక్షంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలుచేయిస్తామని అన్నారు. తాను మంత్రిగా, శాసనసభ్యునిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు మినహాయించి ఈ నాలుగేండ్లలో ఏ ఒక్క అభివృద్ధి పని కనిపించడం లేదని అన్నారు. కరువు ప్రాంతమైన జనగామకు గోదావరి జల్లాలే శరణ్యమని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి జలయజ్ఞం ద్వారా ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించామని అన్నారు. అదే విధంగా జనగామ పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించానని తెలిపారు. ఇదంతా తామే చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనను ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మహాకూటమి భాగస్వామ్య పార్టీల సహాకారంతో అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు. అమెరికాలో యుద్దవిమానాల తయారీలో పనిచేసి గత 35సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పటినుండి రాజకీయాలు చేస్తూ అనేక ఒడిదొడుగులను ఎదుర్కొనానని అన్నారు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుచేస్తూ, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను వివరిస్తూ భావోద్వేగానికి గురై ఆయన కంటనీరు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జీ రమ్యరావు మాట్లాడుతూ మూడనమ్మకాల ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డికి ఓట్లతో తగిన శాస్తి చెప్పాలని కోరారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బర్ల శ్రీరాములు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల సతీష్‌లు మాట్లాడుతూ పొన్నాల విజయం కోసం సమన్వయంతో కృషిచేసి విజయం సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లకావత్ ధన్వంతిలక్ష్మినారాయణనాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్‌నర్సింహారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండీ అన్వర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆకుల వేణు, అధికార ప్రతినిథి రంగరాజ ప్రవీణ్‌కుమార్, నాయకులు గిరి కొండల్‌రెడ్డి, సంపత్, ఆలేటి సిద్దిరాములు పాల్గొన్నారు.