వరంగల్

తెలంగాణ రక్షణకే ప్రజాఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 19: నియంత పాలన నుండి తెలంగాణను రక్షించుకునేందుకే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలన్ని కలిసి ప్రజా ఫ్రంట్‌గా ఏర్పడ్డాయని కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దొంతి మాధవరెడ్డి మాట్లాడారు. మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ నాలుగేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ రూ.2.20 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికపై తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాగిందని, 1200వందల మంది విద్యార్థులు, యువకులు ఆత్మత్యాగాలకు పాల్పడారని చెప్పారు. అమరుల త్యాగాలు, పోరాటాలతో చలించిపోయిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో నియంత పాలనపై మాట్లాడటం, ప్రశ్నించడమే నేరంగా మారిందన్నారు. పరిపాలన చేతకాక మరోసారి అధికార దాహం తో 8నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ప్రజా ఫ్రంట్ ఏర్పడిందని వెల్లడించారు. నర్సంపేటలో భాగస్వామ్య పార్టీల సహకారంతో అత్యధికంగా మెజార్టీ సాధించి నర్సంపేట గెలుపును సోనియాగాంధీకి బహుకరిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే చట్టబద్దమైన పాలన, రాజ్యాంగబద్దమైన పాల న వస్తుందని ఆశించామని, అయితే ప్రజల ఆశలు, ఆకాంక్షలకు విరుద్దంగా కేసీఆర్ నియంతలా పాలన చేపట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. తెలంగాణాలో ప్రజా ఫ్రంట్‌న్ అధికారంలోకి తీసుకవచ్చి కనీస ఉమ్మడి ఏజెండాను అమలు చేస్తామని తెలిపారు. సీపీఐ రూరల్ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికలలో బొంద పెట్టాలని కోరారు. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు. ఈవిలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, రమేష్ యాదవ్, రంజిత్‌రెడ్డి, హింగే మురళీధర్, పెండెం రామానంద్, అక్కపెల్లి రమేష్, సాంబయ్య, దిడ్డి పార్దసారథి, వేముల సాంబయ్య, బానోతు లక్ష్మణ్‌నాయక్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.