వరంగల్

కేసీఆర్‌ను రాజకీయంగా పాతర వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 20: తెలంగా ణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లో ముంచి, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, తెలంగాణాను కాపాడుకోవాలంటే కేసీఆర్‌ను రాజకీయంగా పాతర వేయాలని కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రైవేట్ విద్యాసంస్థల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని రెడ్డి కల్యాణ మండపంలో బొనగాని రవీందర్ అధ్యక్షతన మంగళవారం సమావే శం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థి దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలలో భారీగా అవినీతి జరిగిందని, 30వేల కోట్ల రూపాయల కమీషన్‌ను కేసీఆర్ కుటుంబం దండుకుందని విమర్శించారు. తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను ఎక్కడ అడుగుతారోరనే భయంతోనే ఎనిమిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారని మండిపడ్డారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అక్కడక్కడ అవాకులు, చవాకులు పేలుతున్నారని, డబుల్ బెడ్ రూంలను కట్టించకపోగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. అబద్దాలు చెబుతే ప్రజలు చెప్పులతో బుద్ది చెబుతారని హెచ్చరించారు. నియంత పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ను గద్దెదించి, టీఆర్‌ఎస్‌ను బొందపెట్టడం కోసమే కాంగ్రెస్, తెలుగుదేశం, జన సమితి, సీపీఐ పార్టీలు పీపుల్స్ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయని చెప్పారు. ఈసమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ రవీందర్‌రావు, పట్టణ అధ్యక్షుడు రామానంద్, ప్రైవేట్ విద్యాసంస్థల పరిరక్షణ సమితి నాయకులు ప్రతాప్, ప్రభాకర్‌రెడ్డి, రమేష్, విక్రమ్‌రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.

కేసీఆర్‌ను తరిమికొట్టాలి
* కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్
గూడూరు, నవంబర్ 20: రాబోయేది మహాకూటమి ప్రభుత్వమేనని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ అన్నారు. గూడూరు మండలంలోని ఆదివారంపేట, చిన్న ఎల్లాపురం, భూపతిపేట, సీతానాగారం, లైన్‌తండా, కొమ్ములవంచ, మచ్చర్ల, ఊట్ల, మట్టెవాడ గ్రామాలలో మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ సుడిగాలి పర్యటనతో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల కూడళ్ల వద్ద బలరాంనాయక్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సెంటీమెంట్‌తో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రధానంగా పేదలకు డబుల్ బెడ్ రూంలు, దళితులకు మూడు ఎకరాల సాగుభూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశయాలకు విరుద్దంగా నియంత పాలన కొనసాగించిన కేసీ ఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికలలో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. కాగా కారంపొడితండాకు చెందిన 30 మంది, చిన్న ఎల్లాపురంకు చెందిన మరో 30 మంది, సీతానాగారంకు చెందిన 80 మంది, లైన్‌తండా, వంపుతండాలకు చెందిన వంద మంది, మట్టెవాడకు చెందిన మూడు వందల మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానుకోట జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, పీసీసీ సభ్యురాలు నునావతు రాధ, మాధవపెద్ది రమేష్‌చందర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నునావత్ రమేష్‌నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు కత్తి స్వామి, మాజీ జడ్పీటీసీ కొడిదెల సంజయ్‌కుమార్, నాయకులు చిట్టె వెంకన్న, కోమాండ్ల రమణారెడ్డి, బొప్పిడి శేఖర్‌రెడ్డి, పొన్నం వెంకన్న, ఆవుల కుమారస్వామి, వడ్లకొండ యాకయ్య, ఆవుల సారయ్య, కనె్నబోయిన వెంకన్న, పూజరి శంకర్, మాజీ సర్పంచ్ లాల్‌సింగ్, అర్రెం వీరస్వామి, శ్రీపాల్‌రెడ్డి, శివరాత్రి సంపత్, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.