వరంగల్

కాళేశ్వరంతో పాలకుర్తి సస్యశామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుర్తి/రాయపర్తి, నవంబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే మండలంలోని అన్ని చెరువులు నింపి సస్యశామలం చేస్తానని పాలకుర్తి టీఆ ర్‌ఎస్ అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, పాలకుర్తి మండల కేంద్రాలలో జరిగిన ఆత్మీయ ఆశీర్వాద సభలలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకుర్తిలో జరిగిన సభలో వడ్డెర, అరెకులస్తులతో వేరు, వేరుగా సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విమోచన సంస్ధ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్‌రావు, శివా జీ, రాజేశ్, నిర్మల, ప్రభావతి తదితరు లు పాల్గొన్నారు. అదే విధంగా రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తూ సంక్షేమ పథకాలను అమలు పరిచి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపిన మహాత్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని తెట్టేకుంట తండా, జైరాం తండా, బందనపల్లి, ఏకే తండా, సూర్య తండా గ్రామాలలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన అణగారిన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల మన్నలను పొందిన మహాత్ముడు కేసీఆర్ అని కొనియాడారు. 57 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏనాడు జరగని అభివృద్ది కొత్తగా కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం నాలుగున్నార సంవత్సరాలలోనే తెరాస ప్రభుత్వం ప్రజలు అడగకుండానే అన్ని సంక్షేమ పథాకాలు ప్రజలందరికి కృషి చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిందని అన్నారు. అలాంటి తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు పెద్ద మనస్సుతో మరోమారు ఆశీర్వాదించాలని తనను పాలకుర్తిలో అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ గాంధీ నాయక్, ఎంపీపీ విజయ, అనిమిరెడ్డి, నర్సింహానాయక్, కూమారస్వామి, గోపాల్‌రావు, పూజ, మధు తదితరులు పాల్గొన్నారు.

ఆ ఇద్దరికి ఓటు అడిగే హక్కు లేదు
సంగెం, నవంబర్ 21: పరకాల నియోజకవర్గం నుండి పోటి చేస్తున్న కాంగ్రెస్, తెరాస అభ్యర్ధులు పార్టీలు ఫిరాయించిన వారికి ఓటు అడిగే హక్కు లేదని బీజేపి అభ్యర్ధి విజయచందర్‌రెడ్డి అన్నారు. బుధవారం సంగెం మండల కేంద్రంతో పాటు కుంటపల్లి గ్రామంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా సురేఖ, చల్లా దర్మారెడ్డిలు పూటకో పార్టీ మారుస్తు సిద్దంతాలకు విలువలకు కట్టుబడి లేని నాయకులని వీరిద్దరికి అవకాశం ఇవ్వోదని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేషాద్రి, శ్రీనువాస్, చేరాలు, వేణు, నరేష్ శర్మ, మల్లేశం, రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ అలజడికి ‘దొంతి’ కుట్ర: పెద్ది
నర్సంపేట, నవంబర్ 21: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగకుండా రాజకీయ ఘర్షణలు సృష్టించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి కుట్ర లు చేస్తున్నారని టీఆర్‌ఎస్ అభ్యిర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. గత కొద్ది రోజులుగా గ్రామాలలో టీఆర్‌ఎస్ ప్రచార రథాలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడు లు చేస్తున్నారని, సభలు, సమావేశాల స్థలాలకు వచ్చిన రాజకీయ అలజడి సృష్టిస్తున్నారని చెప్పారు. అదే విధంగా దొంతి ఉపయోగించే భాష అభ్యంతకరంగా ఉందన్నారు. ఎన్నికల కమీషన్ అధికారులు తీసిన వీడీయోలలో సైతం రికార్డు అయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తిట్టని తిట్టు తిట్టిన దొంతి నేడు అదే పార్టీలో చేరి పోటీ చేయడం సిగ్గుచేటన్నారు. 2014 ఎన్నికల సమయంలో అర్ధరాత్రి తనకు వ్యతిరేఖంగా కూటమి కట్టిన నాయకులే మళ్లీ ఈనాడు కూట మి కట్టారని, ప్రజలంతా గమనించాలని కోరారు.