వరంగల్

రైతు సంక్షేమమే టిఆర్‌ఎస్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మే 15: రైతు సంక్షేమమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ క్రమంలో నర్సంపేట నియోజకవర్గాన్ని నీటి సర్క్యూట్ హౌజ్‌గా తీర్దిదిద్ది రైతాంగానికి రెండు పంటల నీరు అందిస్తామని టిఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలోని మాధన్నపేట, రంగయ్య చెరువు, పాఖాల చెరువులకు ఎస్సారెస్పీ, గోదావరి జలాలను మళ్లించి ఈప్రాంత రైతాంగానికి సాగునీరు అందించేందుకు గత ఆరు నెలల నుండి తగిన ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి అందజేశామని చెప్పారు. ఇటీవల రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు తాము అందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపారని, రాబోయే రెండు సంవత్సరాల కాలంలో పనులన్నీ చేసి, రైతాంగానికి ఖరీఫ్, రబీ రెండు పంటలకు నీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలోనే నర్సంపేట నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకవచ్చి, నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ది చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు, మంత్రి కెటిఆర్‌ల అండదండలతో నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నడిపించనున్నట్లు చెప్పారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు గోనెల రవీందర్, రాయిడి రవీందర్, దార్ల రమాదేవి, గుడిపూడి అరుణ రాంచందర్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నాయిని నర్సయ్య, మచ్చిక నర్సయ్య, గుంటి కిషన్, పుట్టపాక కుమారస్వామి, నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచంద్రయ్య, మందుల శ్రీనివాస్, విజయక్రిష్ణ, ఆవుల చంద్రయ్య, తాళ్లపల్లి రాంప్రసాద్, ఇర్ఫాన్, పెరుమాండ్ల రవి, శివరాత్రి స్వామి పాల్గొన్నారు.