వరంగల్

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, మే 15: గత రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి జనగామ పట్టణంతో పాటు పలు మండలాల్లో అనేక ఆర్థికనష్టం జరిగింది. జనగామ మండలం రఘునాథపల్లి, బచ్చన్నపేట, లింగాలఘణపురం, నర్మెట మండలాల్లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో ఆకాశం దద్దరిల్లింది. పలుచోట్ల పిడుగులు పడి పశువులు మృత్యువాతపడగా, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. సుమారుగా 60ఇండ్లవరకు పూర్తిగా ధ్వంసం కాగా వందలాది ఇళ్లు పాక్షికంగా కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జనగామ పట్టణంలో ఎసిరెడ్డినగర్, ధర్మకంచె, సంజయ్‌నగర్ ప్రాంతాల్లో పలు ఇండ్లపై ఉన్న రేకులు గాలిదుమారానికి లేచిపోయి దూరప్రాంతంలో పడిపోవడంతో సంబంధిత కుటుంబాలు ఆరుబయటనే గడిపారు. సిపిఎం నాయకులు ఆ కుటుంబాలను పరామర్శించారు. కూలిపోయిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు కనకారెడ్డి, బొట్ల శ్రీను, గోపిలు డిమాం డ్ చేశారు. కాగా జనగామ మండలం మరిగడి గ్రామంలో మల్లయ్య అనే రైతుకు చెందిన పశువు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడింది. అలాగే ఆ గ్రామంలో సుమారు 25 ఇండ్ల వరకు ధ్వంసమైనట్లు గిరిజన నాయకుడు మిట్యానాయక్ తెలిపారు.
బచ్చన్నపేటలో...
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి వర్షంతో కూడిన ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. ఈదురు గాలుల ప్రభావం ఆలింపూర్, బచ్చన్నపేట, పోచన్నపేట, నక్కవానిగూడెం, చిన్నరామచర్ల గ్రామాలపై చూపాయి. చీకటిపడగానే ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మేఘామృతమైపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలి, వాన ఉదృతమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి కారుచీకట్లు కమ్ముకున్నాయి. బలమైన గాలులకు ఇళ్లపై రేకులు పిట్టల్లా లేచిపోయాయి. జనగామ సిద్దిపేట ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అర్థరాత్రి దాటేవరకు గ్రామాల ప్రజలు చెట్లు తొలగించి వాహనాలకు మార్గం సుగమనం చేశారు.

*