వరంగల్

కల్వర్టు పనులను వెంటనే చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మే 15: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ నుండి శాయంపేట మండల కేంద్రం వరకు 6కోట్లతో బిటి రోడ్డుకు నిధులు మంజూరు కాగా శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు సుమారు ఆరు నెలల క్రితం పనులను ప్రారంభించారు. కాంట్రాక్టర్ పనుల్లో భాగంగా రెండు చోట్ల కల్వర్టులను నిర్మించేందుకు గోతులు తవ్వి తాత్కాళిక రోడ్డును నిర్మించి పనులు ప్రారంభించడం లేదని తిరుమలగిరి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో కోలవాగు, మాటువాగు నుండి తీవ్రంగా వరద వస్తుందని, దానివల్ల డైవర్షన్ రోడ్డు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తిరుమలగిరి గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సదరు కాంట్రాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, అసంపూర్తిగా ఉన్న కల్వర్టు పనులను పూర్తయ్యేలా చర్య తీసుకోవాలని తిరుమలగిరి మాజీ సర్పంచ్ బూర రాజేందర్, ఉప సర్పంచ్ మిర్యాల రవికుమార్, ఆర్‌ఎస్‌ఎస్ మండల కార్యవాహ ఆర్‌ఎల్‌కె ప్రసాద్, మనోహర్ తదితరులు కోరుతున్నారు.