వరంగల్

మిషన్ కాకతీయలో అధికారుల మాయ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, మే 15: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనులలో అధికారుల నిర్లక్ష్యంగా ఏమేరకు ఉందొ అవగతం అవుతుంది. గోలుసు కట్టు చెఱువులు నిండుగా ఉంటేనే భూమిలో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, రైతులకు పంటలు పండుతాయనే మహోన్నత లక్ష్యంతో కోట్లాది రూపాయల నిదులన వెచ్చిస్తున్నా..కింది స్ధాయి అధికారల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యాం నెరవేరక పోగా పలు విమర్శలకు తావిస్తుంది. వివరాలలోకి వెలితే మిషన్ కాకతీయ రెండవ విడత పనులలో భాగంగా గోవిందరావుపేట మండలంలో 20 పనులకు గానూ 248.89కోట్ల నిదులు మంజూరీ అయ్యాయి. ఇందులో భాగంగా మండలంలోని చల్యాయి గ్రామంలో గౌరారం సమీపంలోని గుంటి మల్లయ్య కుంటకు 13.88లక్షల రూపాయలు మంజూరీ అయ్యాయి. ఈ నిధులతో కట్ట మరమ్మత్తుతోపాటు పూడికతీత, తూములనిర్మాణం చేపట్టవలసి ఉంటుం ది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల మోడల్ పాఠశాల పక్కనే ఉన్న కందుల చంద్రయ్య కుంటలో అధికారులు మిషన్‌కాకతీయపనులు తూతూ మంత్రంగా నిర్వహించి చేతులుదులుపుకున్నారు. అధికారులు కుంట మరమ్మత్తులకు 13లక్షల నిధులు మంజూరీ అయ్యాయని రెండు షట్టర్లు, తూములు నిర్మాంచాల్సి ఉంటుందని చెప్పిన వారు తిరిగి అక్కడకు వెల్లకుండా గుంటి మల్లయ్య కుంటకు వచ్చిన నిదులతో ఎకరంకూడాసాగులేని కందుల చంద్రయ్య కుంటలో పనులు చేసారు. ఇదే కుంటలో ఇంతకు ముందు ఉపాధి కూలీలు చేసిన పనులనే నామమాత్రంగా చేసి సంబంధిత గుత్తేదారు చేతులు దులుపుకున్నట్టు స్ధానికుల ఆరోపణ. ఇంతగాచేసినా ఈ నిదులతో పంటలకు నీరు అవసరం లేకపోవడం కొసమెరుపు. మంజూరీ ఓచోటచేసి పనులు మరోచోట చేసిన అధికారులను, గుత్తేదారుల మతలబేమిటో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని స్ధానికులు కోరుతున్నారు. ఈ కుంట వల్ల ఉపయోగం లేదని చల్యాయి గ్రామానికి చెందిన తేళ్ల హరిప్రసాద్ అనే రైతు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపించడం వల్ల మిషన్ కాకతీయ పనులలలో అవకతవకలకు చెక్ పడుతుందని స్దానికులు కోరుతున్నారు.
ఐబి అధికారుల నిర్లక్ష్యం వల్లే పొరపాటు
నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే మంజూరీ ఓ చోట జరిగితే మరోచోట పనులు చేసారని స్ధానిక రైతు, వార్డు సభ్యులు తేల్ల హరిప్రసాద్ అన్నారు. మిషన్ కాకతీయలో చేసిన గుంటి మల్లయ్య కుంట ఇది కాదని అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు.